About Me

About Meనేనెవరు?   

      నా పేరు వేంపల్లి రాజశేఖర రెడ్డి, వయసు 55 సంవత్సరాలు. ప్రొద్దుటూరు నివాసిని. మా వూరు భారత దేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని కడప జిల్లాలో ఉంది. పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. వీలయినంత వరకు అందరికీ ఆరోగ్యం గురించి చెబుతుంటాను. చాలా కాలంగా నేను అనేక రకాలుగా ఆరోగ్యం గురించి చెబుతున్న వారి ఉపన్యాసాలు వింటూ ఉన్నాను. వారి పుస్తకాలు చదువుతున్నాను. వీడియోలు చూస్తున్నాను. మొదట నాకు ఆరోగ్యం పట్ల కొంత అవగాహన కలిగించిన ఘనత సిద్ధ సమాధి యోగ (SSY) గురువులదే. 1995 ప్రాంతంలో పులివెందులలో వారు పెట్టిన క్లాసులకు అటెండ్ అయ్యాను. అయితే వారు చెప్పినవి 10 నుండి 20 శాతం మించి అనుసరించలేక పోయాను. ఆ తర్వాత బ్రతుకు పోరాటంలో ప్రొద్దుటూరుకు రావాల్సి వచ్చింది.

ఆరోగ్య విషయాలలో అవగాహన

     ఆ తర్వాత 2004 లో మంతెన సత్యనారాయణ రాజు గారు గురించి విన్నాను. మొదట ఆయన పుస్తకాలు చదవడం ప్రారంభించాను. అదే సమయానికి ప్రొద్దుటూరులో ఆయన మీటింగ్ లు మొదలయ్యాయి. ఇక అప్పటి నుండి ఆయన చెప్పే పద్ధతులను అనుసరించడం ప్రారంభించాను. చాలా ఏళ్ల పాటు పాటించాను. అయితే వాటిని కుటుంబ సభ్యులందరి చేత పాటింప చేయడం నాకు సాధ్యం కాలేదు. 

     ఆ తర్వాత అప్పుడప్పుడు పలు రకాల ఆరోగ్య విధానాలు వస్తూనే ఉన్నాయి. ఢిల్లీ AIIMS లో పనిచేసిన Dr.Bimal Chhajer గారి The Science And Art Of Living (SAAOL) కాన్సెప్ట్ నాకు కొంత  నచ్చినది. ఈ మధ్య కాలంలో విజయవాడకు చెందిన వీరమాచనేని రామకృష్ణ గారి డైట్ బాగా ప్రాచుర్యం పొందింది.

ప్రస్తుతం పాటిస్తున్నవి

     మైసూరు కు చెందిన డా. ఖాదర బాష  “సిరి ధాన్యాల (Millets)” కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. దాన్ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను. ఢిల్లీ నుండి ప్రచారం చేస్తున్న డా. బిస్వరూప్ రాయ్ చౌధురి Natural Food Concept కూడా చాలా బాగా నచ్చింది. ఈ రెండింటిని ప్రస్తుతం ఫాలో అవుతున్నాయి. ఎక్కువగా సహజాహారమైన పండ్లు, కూరగాయలు తినడం. వండిన ఆహారం తినాలని పించినపుడు డా. ఖాదర్ బాష గారు చెప్పిని సిరి ధాన్యాలను తినడం. ఏలాంటి ఇతర ప్రయత్నాలు చేయకుండానే, ఈ రెండు పద్ధతుల ద్వారా రెండు నెలల్లో 7 కేజీల బరువు తగ్గాను. ఇతర అనేక చిన్న, చిన్న ఇబ్బందులు కూడా తొలగి పోయాయి.

 

Who Am I?About Me

     I am Raja Sekhar Reddy Vempalli, 55 years old. A native of Proddatur town, of Andhra Pradesh State, in India. Healthy n Happy. Very interested to guide people about “How to be Healthy Naturally”. More than 20 years I am learning about the health, in various ways. Following different methods. Reading books about health. Watching videos. Reading blogs. My health journey started with SSY (Siddhi Samadhi Yoga). In 1995 I first attended their classes in Pulivendla. A small town in Kadapa dt of AP, India. But I am unable to follow the principles for more than 20%.

Health Awareness

     First I heard about Dr. Manthena Satya Narayana Raju in 2004. I started reading his books. Simultaneously Dr. Raju’s meetings started in Proddatur. Since then I started following him. In due course, I came to know about Dr.Bimal Chhajer’s The Science And Art Of Living(SAAOL). Taken chelation therapy once. Recently Mr. Veeramachaneni Rama Krishna from Vijayawada became very famous in a very short period.

What I am following Now

     I am very much impressed by the two concepts, which I came to know recently. One is Dr.Khader Basha from Mysore about MILLETS. The second is Dr. Biswaroop Roy Choudhury from Delhi, who tells about Natural food concept. Now I am following both of them. Regularly eating fruits and vegetables. Occasionally eating MILLETS. With these two methods, I lost 7 kgs within 2 months.