Donot Cure This Way

జబ్బులను ఇలా నయం చేయకూడదు

      మనం సాధారణంగా జబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తాం? వాటిని నయం చేయడానికి ఎలాంటి మార్గాలను అనుసరిస్తాం? వాటి వల్ల మనకు జరిగే నష్టాలేమిటో? తెలుసుకుందాం.

మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం

      మనం ఏ చిన్న జబ్బు వచ్చినా, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళతాం. ఆయన మనకు కొన్ని టాబ్లెట్లు, టానిక్ లు రాస్తారు. వాటిని మన క్రమం తప్పకుండా వాడతాం. అయితే ఇక్కడే మన అసలు సమస్య మొదలౌతుంది. కృత్రిమ రసాయనాలతో తయారైన ఈ మందులకు శరీరంలోని రోగ గ్రస్త కణాలకు, ఆరోగ్య కర కణాలకు మధ్య తేడా గుర్తించే శక్తి ఉండదు. కాబట్టి ఇవి రోగ గ్రస్త కణాలతో పాటు కొన్ని ఆరోగ్య కర కణాల పై కూడా దాడి చేసి వాటి ని కూడా చంపేస్తాయి. ఇది రోగాలను మరింత పెరగడానికి, లేదా ఇతర సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి దారి తీస్తుంది. ఇది చాలా మందికి అనుభవమయ్యే ఉంటుంది. మనం ఒక రోగానికి మందు వాడితే, మరో ఇబ్బంది వస్తుంది. మనం కీళ్లు, ఎముకల ఇబ్బంది కి మందులు వాడితే మనకు కడుపులో మంట వస్తుందని డాక్టర్లే చెబుతుంటా రు. దానికి కూడా మరో టాబ్లెట్ వాడమని చెబుతుంటారు.

లక్షణాలకు మందు వాడితే రోగం ఎలా నయమౌతుంది

     సాధారణంగా డాక్టర్లు ఇచ్చే మందులు రోగానికి కాకుండా రోగ లక్షణాలపై పని చేస్తుంటాయి. ఉదాహరణకు మనకు కాలు బెణికి నొప్పిగా ఉంటే మనకు ఒక మాత్ర లేదా ఆయింట్ మెంట్ ఇస్తారు. దాని వల్ల మన కాలు నొప్పి నయం కాదు గానీ ఆ నొప్పి ఉన్నట్లు మనకు తెలియదు అంతే. ఆ శరీర భాగం నుండి నొప్పి సిగ్నల్ ని మెదడుకు చేరకుండా ఈ మందులు ఆపుతాయి తప్ప, అసలు జబ్బును నయం చేయవు. సాధా రణంగా మనం డాక్టర్ ల దగ్గరికి వెళ్లి నప్పుడు మన రోగ లక్షణాలను మాత్రమే చెబు తాము. మనకు ఏ రోగం ఉన్నదో మనకు తెలియదు. దాన్ని డాక్టరు గుర్తించి తగు మాత్ర లు ఇవ్వాలి. కానీ ప్రస్తుతం ఏం జరుగుతోంది. వాంతు లు, బేదులు, జ్వరం, తల నొప్పి, ఆకలి లేక పోవడం ఇలా మనం  రోగ లక్షణాలను చెబుతాం. డాక్టర్ లు ఈ లక్షణాలు దేని వలన వచ్చాయో, ఆ రోగ మేమిటో తెలుసు కుని దానికి చికిత్స చేయాలి. కానీ ప్రస్తుతం రోగ లక్షణాలకే చికిత్స జరుగు తోంది. రోగానికి కాదు. ఇది ఎలా ఉందంటే, మనం మోటారు బైక్ లోనో, కారులోనో వెళుతున్నాం. అందులో ఇంధనం పెట్రోలు గానీ, డీజల్ గానీ అయి పోవడానికి కొద్దిగా ముందు ఒక హెచ్చరికి చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి. ఇందనాన్ని నింపాలి. కానీ మనం హెచ్చరిక చేసే పరికరం వైరు ను కత్తి రిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా. ఇప్పుడు మనకు జరుగు తున్న ట్రీట్ మెంట్ కూడా ఇలాగే ఉంది.

రోగం తో కాదు, మందులతో నే ఎక్కువ మంది చనిపోతున్నారు

      శరీరం ఈ లక్షణాలు పెట్టడానికి కారణం, తనను తాను బాగు చేసుకోవడానికి తనకు అవకాశం ఇవ్వమని చెప్పడమే. ఉదాహరణకు శరీరం తనకు అంతర్గతంగా ఇబ్బంది వచ్చినప్పుడు జ్వరం అనే లక్షణాన్ని బయ టకు చూపిస్తుంది. నోరంతా ఇబ్బందిగా ఉండడం, వొళ్లు నొప్పులు, నీరసం గానూ ఉంటుంది. నోరు ఇబ్బంది ఏమీ తినకుండా ఉండడం కోసం. వొళ్లు నొప్పులు, నీరసం విశ్రాంతి తీసుకోవడం కోసం. ఇలా శరీరం చెప్పిన వాటిని మనం వింటే అది తనంతట తానే బాగు చేసుకుంటుం ది. కానీ అప్పుడు డాక్టర్ మొదట చేసే పని జ్వ రం తీవ్రత తగ్గడానికి మందులు ఇవ్వ డం. జ్వరంలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఎక్కువ ఉష్ణోగ్రత  తో సూక్ష జీవులను, వైరస్ ను చంపడానికి శరీరం ప్రయత్నిస్తుంది. మరి ఉష్ణోగ్రత తగ్గితే, ఈ వైరస్ లు ఎక్కువై మన రోగం మరింత ఎక్కువ కావడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనిపై డాక్టర్ బిస్వరూప్ రాయ్ చౌధురి గారు ఒక సమావేశంలో చెప్పారు. రోగులు వైరస్ వల్ల చనిపోవడం లేదు. కేవలం డాక్టర్లు ఇలా చేయడం వల్లనే చని పోతున్నారు అని చెప్పారు.

నయం చేసుకోవడానికి శరీరానికి అవకాశం ఇవ్వండి

     రోగ లక్షణాలను బయట పెట్టడానికి ప్రధాన కారణం, శరీరం తన లోపల పేరుకు పోయిన వ్యర్థ పదార్థా లను, రోగ కారకాలను శుభ్రం చేసుకోవడానికే. మనం వాడే మందులు రోగ లక్షణాలను మనకు కనపించ నీయ కుండా చేస్తాయి. అలాగే శరీరం చేసుకునే ఈ శుభ్రత ను కూడా అడ్డు కుంటాయి.

     మనం ఇప్పటి కైనా మేల్కొని, ఈ ప్రాణం లేని మందులను మానాలి. అలాగే రోగ లక్షణాలకు కాకుండా, అసలు రోగానికి చికిత్స చేయాలి. అప్పుడే మనం ఆరోగ్యం గా జీవించడం సాధ్యమౌతుంది.

     ఈ వ్యాసం పైన మీ అభిప్రాయాన్ని కింది comment box ద్వారా తెలియ జేయండి.

     సహజంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలుసు కోవడానికి sahajarogya.com లో వ్యాసా లను రెగులర్ గా చదవండి.

     ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే social media ద్వారా share చేయండి.

Please Share It

Leave a Comment