Gym Donot give Health

Gym Donot give Health

జిమ్ కెళితే ఆరోగ్యం రాదు

     ప్రపంచం లో అత్యంత ఆరోగ్య వంతులైన వారు గానీ, ఎక్కువ కాలం జీవించిన వారు గానీ ఎవరూ జిమ్ కెళ్లలేదు. మీరు ఆరోగ్యం గా ఉండాలని కోరు కుంటే మీకు కావలసింది ట్రెడ్ మిల్స్ కాదు, బరువు తగ్గించే యంత్రాలు కాదు, ట్రీట్ మెంట్లు కాదు. మీరు నా మాట నమ్మొద్దు. ప్రపంచం లో ఎక్కువ కాలం జీవించిన వారి గురించి తెలుసు కోండి. అదే మీకు గట్టి రుజువు.

     దీర్ఘ కాలం జీవించిన వారెవ్వరూ, అందు కోసం మందులు, మాత్రలు తీసు కోలేదు. లేదా పెద్ద పెద్ద పరుగు పందేలలో పాల్గొన లేదు. లేదా జిమ్ కెళ్లి తమ జీవిత కాలాన్ని పెంచు కోలేదు.

సహజ జీవన విధానమే ఆరోగ్యం

      అందుకు బదులుగా వారు జీవించాల్సిన కాలం గురించి ఎలాంటి ఆలోచన లేకుం డా, కేవలం సహజ వాతవరణంలో జీవిస్తున్నారు. రోజు మొత్తంలో వీలైనంత ఎక్కువగా నడుస్తారు. పెరటి తోటలలో పని చేస్తారు. ఇంటి పని లో గానీ, తోట పని లో గానీ యం త్రాలతో పని చేయడం పూర్తిగా తగ్గిస్తారు.

      సహజం గా తమ పనులను తామే చేసు కోవడం, యంత్రాలకు దూరంగా ఉండటమే, ఈ దీర్ఘ కాల ఆరోగ్య వంతుల రహస్యమని  ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధన లు రుజువు చేస్తున్నాయి.

పరుగుల ప్రపంచం లో ఇది అసాధ్యం

     కానీ ప్రస్తుతం పరుగులు పెట్టే ఈ ప్రపంచంలో ఇది అసాధ్యం అనిపిస్తుంది. ఇప్పు డు మన జీవితాలలో ఎక్కువగా కూర్చుని పని చేయడం లేదా కంప్యూటర్ కో , మొబైల్ కో అతుక్కు పోవడం తప్పని సరైంది. మనకు కదలికలకు చాలా తక్కువ అవకాశం ఉంది. మనం ఇంట్లో నూ కూర్చోవడమే, బయటకు వచ్చి ఎక్కడి కన్నా వెళ్లా లంటే రెండు చక్రాల వాహనమో, నాలుగు చక్రాల వాహనమో తప్పని సరిగా వాడు తున్నాం. కనీసం కొద్ది దూరం నడిచి వెళ్లి, పబ్లిక్ ట్రాన్స్ పోర్టు ను వాడడానికి కూడా మనం ఇష్ట పడటం లేదు.

తలక్రిందు లైన శ్రమ

     రోజంతా శరీర కదలిక లతో జీవించడం ఎంతో సహజంగా ఉంటుంది. మన కెంతో ఆనంద కరంగా, ఆహ్లాద కరంగా ఉంటుంది. మనం ఒక శతాబ్దం(100 సంవత్సరాలు) కిందటి మానవ జీవితా లను పరిశీలిస్తే  అప్పుడు కేవలం 10 శాతం మంది మాత్రమే కూర్చునే పనులు చేసేవారు. మిగిలిన 90 శాతం మంది శరీర కదలిక లతో ముడి వడిన పనులు చేసేవారు. కానీ ఇప్పుడు ఇంటా, బయటా ఇది తలకిందులైంది. కేవలం 10 శాతం మంది మాత్రమే శారీరక శ్రమ చేసే వారున్నారు. మిగిలిన 90 శాతం మంది కూ ర్చుని పని చేస్తున్నారు. మన అనారోగ్యాలకు ఇదే ప్రధాన కారణం గా చెప్పుకో వచ్చు.

     కానీ ఇప్పటికీ మించి పోయింది లేదు. మీరు మీ జీవితాల లో కదలిక లను తీసుకు రా వడానికి ఎన్నో మార్గాలు న్నాయి. చాలా సులు వైన అవకాశాలు ఉన్నాయి. అవేమిటో మనం ఇప్పుడు పరిశీలిద్దాం.

సులువైన మార్గాలు

     ఇందుకు అన్నిటికంటే సులువైన, ఉత్తమమైన మార్గం మనం ప్రయాణించే పద్ధతిని పద్ధతిని మార్చుకోవడం. ఇది ముఖ్యంగా మనకు అతి దగ్గర లో ఉన్న వాటికి నడిచి వెళ్ల డం లేదా మోటారు వాహనాలకు బదులుగా సైకిల్ ని ఉపయోగించడం. పిల్లల ను స్కూ ల్ కు తీసుకెళ్లడం కావచ్చు, సరుకుల కోసం అంగడికి వెళ్లడం కావచ్చు. లేదా స్నేహితు ల ఇంటికి వెళ్లడం, లేదా ఏదైనా  శుభ  కార్యానికి హాజరవడానికి గానీ మోటారు వాహ నాల ను ఉపయోగించ కుండా కాలి నడకన వెళ్లండి. అలా వీలు కాని పక్షంలో కనీసం ఇంటి నుండి కొంత కాలి నడక దూరం లో, అందు బాటు లో ఉండే పబ్లిక్ ట్రాన్స్ పోర్టు ( ఆటో, బస్సు, రైలు తదితరాలు) ను ఉపయోగించడం ఉత్తమం.

శ్రమే ఆయుష్షు కు మూలం

      ఇలా కాక పోయినా, మీ ప్రయాణానికి అనుబంధంగా ఏదో ఒక శారీరక శ్రమను చేయ డానికి తగిన ప్రణాళిక రూపొందించు కోవడం ఎంతో ఉత్తమ మని అనేక పరిశోధన లు నిరూపించాయి. ఏ రూపం లోనైనా మనం చేసే ఈ శారీరక శ్రమ మన ఆయు ప్రమా ణం (జీవిత కాలం) పెంచుతుందని మనం నమ్మితే, ఆ శ్రమను మనం ఎంతో ఆనందంగా చేయగలం. మీరున్న చోట ఇలాంటివి సాధ్యం కాని పరిస్థితి ఉంటే, మీరు ఇందుకు ఏదో ఒక మార్గాన్ని వెతుక్కోవాలి. చివరకు అది రోజూ అరగంట నడక ఐనా సరే, అదే మీ ఆరోగ్యాన్ని బాగు పరచి, జీవిత కాలాన్ని పెంచుతుంది.

నడక తో రోగాలకు దూరం

     అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఇటీవలి దీని పై పరిశోధన చేసింది. వారం లో కనీసం ఆ రు గంటల పాటు నడిస్తే, గుండెపోటు, ఊపిరి తిత్తుల వ్యాధి మరియు క్యాన్సర్ వల్ల మ రణించే ప్రమాదం చాలా వరకు నివారించ వచ్చని ఆ పరిశోధనలో తేలింది. ఇదే పరి శోధన మరో విషయాన్ని కూడా చెప్పింది. ఇది కూడా సాధ్యం కాని వారికి, వారం లో కనీ సం 2 గంటలు నడిచినా మనకు జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గి, మన ఆయు ప్రమాణం కొంత పెరుగుతుందని అదే పరిశోధన తెలియ జేస్తోంది.

మానసిక ఆరోగ్యానికి కూడా శారీరక శ్రమే ఒౌషధం

      నడక మెదడుకు కూడా గొప్ప ఒౌషధం. మానసిక వైకల్యం వచ్చే అవకాశాన్ని, రోజూ వా రి నడక 40% పైగా తగ్గిస్తుందని ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపు ణులు తెలుపుతున్నారు.

     దీర్ఘ కాల నడకలు సాధ్యం కాని పక్షంలో, దాన్ని రోజంతా చిన్న చిన్న నడకలుగా విభ జించుకోండి. గంట కు కనీసం 5 నిమిషాలు నడవాలని నిర్ణయించు కోండి. మీరు పనిచే సే టేబుల్ వద్ద కొంత సమయం నిలబడండి. గంటకో సారి అటు ఇటు తిరగండి. మధ్య లో అల్పాహారం కోసం గానీ, భోజనానికి గానీ మీ సీటు వద్దే కూర్చోకండి. బయటకు వెళ్లి తాజా గాలి ఉన్న ప్రాంతం లో తినడానికి ప్రయత్నించండి.

     మన శరీరాలు కనీస శ్రమ చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాయి. అంటే మీరు తప్పని సరిగా జమ్ కు వెళ్లమని గానీ, భారీ బరువులు మోయాలని గానీ, తీవ్ర శారీరక శ్రమ చే యాలని గానీ అర్థం కాదు.

      సాధారణ, సహజ కదలిక ల ప్రభావం మన శరీరం పై ఎంతో ప్రతిభా వంతం గా ఉంటుంది అని చెప్పడమే నా ఉద్దేశ్యం.

      ఈ వ్యాసం పైన మీ అభిప్రాయాన్ని కింది comment box ద్వారా తెలియ జేయండి.

      సహజంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలుసు కోవడానికి sahajarogya.com లో వ్యాసా లను రెగులర్ గా చదవండి.

      ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే social media ద్వారా share చేయండి.

Please Share It

Leave a Comment