Health In our Hands Telugu

Health in our Hands Teluguఆరోగ్యం మన చేతల్లోనే…

నమస్కారం మిత్రులారా!

    ఆరోగ్యం… చాలా విలువైనది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీన్ని గురించి ఈ మధ్య కాలంలో చాలా మంది చాలా రకాలుగా తెలియ జేస్తున్నారు.

     ఏ ఇద్దరు కలిసినా ఆరోగ్యాన్ని గురించే మాట్లాడు కుంటున్నారు. చాలా విషయాల గురించి తెలుసు కుంటున్నారు. అల్లోపతి మొదలుకొని హోమియోపతి, యునాని, నాచురోపతి, ఆక్యుపంచర్, ఆక్యుప్రెజర్ ఇలా ప్రపంచంలో ఉన్న అనేక రకాల వైద్య విధానాల గురించి తెలుసు కుంటున్నారు. అన్నిటి వెంటా పడుతున్నారు. కాని ఎవరికీ ఆరోగ్యం దొరకడం లేదు. కారణాలు తెలుసుకున్నా, వైద్య విధానాలను అనుసరించడంలో విఫలమవడమే ఇందులో ప్రధాన లోపం. ఇప్పటికీ మించి పోయింది లేదు. రండి, మన చేతలను (అంటే చేసే పనులను) మార్చుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

  ఆస్పత్రులకు వెళ్లో, మందులు వాడో తాత్కాలిక ఉపశమనం పొందడానికి కాదు. కేవలం మన చేతలను మార్చుకొంటే, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సాధ్యమౌతుంది. దాన్ని మనం ఆచరించి చూపుదాం. పలువురికి మార్గ దర్శకులమౌదాం…

     పైన చెప్పుకున్న పలు వైద్య విధానాలు, ఎంతో మందికి ఎన్నో విధాలు గా ఉపయోగ పడుతున్నాయి. ముఖ్యంగా అత్యవసర పరిస్థితులలో అల్లోపతి వైద్య విధానం ఎందరికో ప్రాణం పోస్తోంది. కొన్నిఇతర వ్యాధుల విషయంలో రక రకాల వైద్య విధానాలు ఎందరికో ఉపశమనం కలిగిస్తున్నాయి. మరెందరికో వ్యాధులను నయం చేస్తున్నాయి.  ఇది ఎవరూ కాదనలేని నిజం. అయితే ఇందులో చాలా రకాల మోసాలు జరుగుతున్నాయి. అది వేరే చర్చ అందులోకి మనం వెళ్లడం లేదు.

     కాని ఏదైనా జబ్బు వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ వైద్య విధానాలను ఉపయోగించుకుంటున్నాము. అయితే ఇంగ్లీషు లో ఒక సామెత ఉంది. “Prevention is better than cure.” అంటే రోగం వచ్చిన తర్వాత దాన్ని నయం చేసుకోవడం కన్నా, ఆ రోగం రాకుండా చూసుకోవడం ఉత్తమం అని దీని అర్థం. అయితే సమస్య లేదా అనారోగ్యం రాకుండా చేయగలిగే పద్ధతి ఏ వైద్య విధానంలోనూ లేదు. అయితే అందుకు పరిష్కారం తెలుసుకోవడమే మన ముఖ్య ఉద్దేశం. రోగం వచ్చిన తర్వాత వైద్యుల చుట్టూ, ఆస్పత్రుల చుట్టూ తిరగడం మానేద్దాం. రోగాలు రాకుండా కాపాడు కోవడానికి ఏమి చేయాలో తెలుసుకుందాం.

     ఈ వ్యాసం పై మీ అభిప్రాయాన్ని కింది comment box ద్వారా తెలియజేయండి

Please Share It

2 thoughts on “Health In our Hands Telugu”

Leave a Comment