How to Improve Immunity Power

How to Improve Immunity Power

రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

      మనం మన శరీర రోగ నిరోధక శక్తి ని కాపాడు కోవడం ఎలా? లేదా బలహీపడిన ఈ రోగ నిరోధక శక్తి ని తిరిగి పుంజు కొనేలా చేయడానికి, ఏమి చేయాలో తెలుసు కుందాం.

      మనం ఆరోగ్యంగా ఉండడానికి గానీ, రోగ గ్రస్తం కావడానికి గానీ మన ఆహారం ప్రధాన పాత్ర వహిస్తుంది. అయితే మన రోగాలకు మన ఆహారమే కారణమని మనకు తెలియదు. మరేదో బాహ్య కారణమే మనలను రోగాల పాలు చేస్తోందని మనం సాధారణంగా నమ్ముతుంటాం. ఈ అత్యాధునిక చికిత్సా విధానమైన అల్లోపతికి పితామహుడుగా చెప్ప బడుతున్న “హిపోక్రటీస్” ఒక గొప్ప సత్యాన్ని ఎన్నో దశాబ్దాల క్రితమే చెప్పాడు. “మన మంతా మన ఆరోగ్యాన్ని బాగు పరచు కోవడానికి గానీ, రోగాలను తగ్గించు కావడానికి గానీ అవసర మైన మందులను మన ఆహారం లోనే వెతుక్కోవాలి ” అని ఆయన చెప్పారు.

సమతుల ఆహారమే మన ఆరోగ్య రహస్యం

      మనం సమతుల ఆహారాన్ని (Balanced Diet) తీసుకోవాలి. అందులో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు, పిండి పదార్థాలు కావాల్సిన పరిమాణంలో ఉండే ఆహారాలను తినాలి. అప్పుడే మనకు అవసరమైన అన్నీ, సమ పాళ్లలో అందుతాయి. ఆరోగ్యాన్ని కాపాడతాయి. మన శరీరానికి కనీసం అవసరమైన శాతాలను ఇవి. పిండి పదార్థాలు (Carbohydrates) 40% నుండి 50% కావాలి. ప్రోటీన్లు (Protiens) 15% నుండి 20% అవసరమౌతాయి. కొవ్వు పదార్థాలు (Fats) 3% నుండి 5% తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్ (Vitamins & Minerals) 20% నుండి 25% సరిపోతాయి. ఇక పీచు పదార్థాలు (Fibers) కనీసం 5% నుండి 7% ఉంటేనే జీవ క్రియ సక్రమంగా జరిగి, జీర్ణ కోశం శుభ్రమై,  అనవసర పదార్థాలు బయటికి పంపడం సులభ మౌతుంది.

క్షార గుణం కలిగిన ఆహారాన్నే ఎక్కువగా తీసుకోవాలి

     మరో వైపు మనం తినే ఆహారం ఆమ్ల గుణం (Acidic Nature) కలిగి ఉందా? లేక క్షార గుణం (Alkaline Nature) కలిగి ఉందా? అని మనం గమనించు కోవాలి. వీలైనంత వరకూ క్షార గుణం కలిగిన ఆహారాన్నే ఎక్కువగా తీసు కోవడానికే ప్రయత్నించాలి. అదే ఆరోగ్యకరం. పండ్లు, ఆకు కూరలు, కూర గాయలు క్షార గుణాన్ని కలిగి ఉంటాయి. ధాన్యాలలో ఆమ్ల, క్షార గుణాలు దాదాపు సమానంగా ఉంటాయి. స్వీట్లు, ఫ్రైడ్ ఐటమ్స్, మాంసాహారాలు ఆమ్ల గుణం కలిగి ఉంటాయి. మనం 75% నుండి 80% శాతం క్షార గుణ ఆహారాన్నీ, 20% నుండి 25% ఆమ్ల గుణ ఆహారాన్నీ తీసుకోవడం ఉత్తమం.

ఆహారం ప్రాముఖ్యతను గుర్తించాలి

        మనం మన ఆరోగ్యాన్ని కాపాడు కోవడం లో ఆహారం ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తుంది అని గుర్తించడం ఎంతో అవసరం. మనం ఎన్ని రకాల సర్కస్ ఫీట్లు చేసినా, సరైన ఆహారం తీసుకోనిదే ఆరోగ్యం రాదు. మనం ఎంతో శారీరక శ్రమ చేయొచ్చు. ఎక్సర్ సైజ్ లు చెేయొచ్చు. యోగాసనాలు చెయ్య వచ్చు. ఇవన్నీ చేసినా సరైనా ఆహారం తీసుకోనిదే, మనం ఆరోగ్యంగా ఉండడం సాధ్యం కాదు. మనం పల్లెటూర్ల లో రైతు శ్రమ చేసే వారిని గానీ, పట్టణాలలో ఫ్యాక్టరీలలో శారీరక శ్రమచేసే వారిని గానీ గమనించ వచ్చు. వారు ప్రతి రోజూ కనీసం 8 గంటలకు పైగా శ్రమ చేస్తారు. ఇటీవల కాలంలో వారు కూడా రోగాల పాలవుతూ, ఆస్పత్రుల చుట్టూ తిరగడం మనం గమనిస్తూ ఉన్నాం. ఇందుకు ప్రధాన కారణం వారు తీసుకునే ఆహారమే ననేది, అనేక పరిశోధనలు నిరూపిస్తున్నాయి.

మన పండ్ల(Tooth) తో మన సమాధి ని తవ్వుకుంటున్నాం

      ఒక ఆహార నిపుణుడు చెప్పిన, ఈ వాక్యాన్ని ఎక్కడో చదివాను. “మనం మన పండ్లను (Tooth) ఎక్కువగా వాడితే, మన సమాధిని మనమే తవ్వు కున్నట్లే”  అని ఆయన చెప్పాడు. మనం అతిగా తినడం ఒక్క పొట్టకే (జీర్ణ కోశానికి) ప్రమాద కరం కాదు. అది మన అంతర్గత అవయవాలైన కిడ్నీలు, లివర్ పైన కూడా అధిక భారం అవుతుంది. అవసరమైన దానికన్నా ఎక్కువ తినడం, మనకేమాత్రం ఉపయోగ పడదు. అది రోగానికి లేదా డాక్టర్ లకు, మందుల కంపెనీల వారికే ఉపయోగ పడుతుందంటే అతిశయోక్తి కాదు. మన ఆయుః ప్రమాణం పైన కూడా ఈ అధిక తిండి ప్రభావం పడుతుంది. అందుకే మన వయస్సు పెరిగే కొద్దీ, తినే తిండి పరిమాణాన్ని తగ్గించాలని, పెద్దలు చెబుతుంటారు.

శారీరక శ్రమ ప్రాముఖ్యత

      మన ఆరోగ్యాన్ని కాపాడు కోవడం లో శారీరక శ్రమ పాత్ర కూడా గణణీయమైనదే. మన తలిదండ్లులూ, తాత ముత్తాతలూ, ఎక్కువ వయసు వరకూ  ఎలాంటి అనారోగ్యాలు లేకుండా జీవించడం మనం చూసే ఉంటాం. వారి జీవన, ఆరోగ్య రహస్యం వారి శారీరక శ్రమే. ఏదో సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంది. “నేను ఈ పని చేసి, ఈ రోజు తిండి తినడానికి అర్హత సంపాదించు కున్నాను”, అనేదే ఆ డైలాగ్. కాబట్టి మనం తిన్న తిండి అరిగి పోయి, మనకు తిరిగి ఆకలైన తర్వాత తింటేనే అది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తిన్న తిండి పూర్తిగా అరిగి నప్పుడే, దాని లోని పోషక పదార్థాలు శరీరం లోని అన్ని కణాలకు అందుతాయి. అప్పుడే శక్తి ఉత్పత్తి జరుగుతుంది. ఇలా ఆహారం అరగడానికీ, కణాలకు అందడానికి శారీరక శ్రమే ప్రధాన పాత్ర వహిస్తుంది.

      శారీరక శ్రమ గుండెకూ, రక్త నాళాలకు బలం చేకూరుస్తుంది. ఈ శారీరక శ్రమే రక్తనాళాలలో కొవ్వు పేరుకు పోయి, అవి మూసుకు పోకుండా కాపాడుతుంది. అలాగే ఊపిరి తిత్తులు బలంగా తయారై, శరీరాని అవసరమైనంత ఆక్సిజన్ ను అందిస్తాయి. శ్రమ చేసే సమయంలోనూ, ఆ తర్వాత పట్టే చెమట ద్వారా శరీరం లోని మలిన పదార్థాలు బయటకు పోయి, శరీరం శుభ్ర మౌతుంది.

మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత మరువ రానిది

      మనం హాయిగా జీవించాలంటే, శారీరక ఆరోగ్యం తో పాటు, మానసిక ఆరోగ్యం కూడా మనకు ఎంతో అవసరం. ప్రతి కూల ఆలోచనల (Negative Thoughts) ప్రభావం కూడా మన ఆరోగ్యం పైన గణణీయంగా ఉంటుందని, అనేక పరిశోధనలు రుజువు చేశాయి. ఆనేక శారీరక రుగ్మతలకు మూల కారణం మానసికమే నని డాక్టర్లు కూడా తరచూ చెబుతుంటారు. ఈ అత్యాధునిక(?) యుగంలో మానసిక వత్తిడిని తప్పించు కోవడం చాలా కష్టం. కానీ మనం మనకు సాధ్యమైన రీతిలో ఈ వత్తిడిని తగ్గించు కోగలిగితే చాలా రోగాలను దూరం చేయవచ్చు. తరచుగా డాక్టర్ లు షుగర్ వ్యాధికి (Diabetes) ప్రధాన కారణాలలో మానసిక వత్తిడి ఒకటని చెబుతుంటారు. మానసిక ప్రశాంతతకు యోగాసనాలూ, ప్రాణాయామం ఎంతో ఉపయోగ పడతాయి. కానీ మనం ఆర్థిక, సమాజిక విషయాలలో సంతృప్తి పడితేనే మనకు ఇవి ఉపయోగ పడతాయి.మనం సంపాదన వెంటా, హోదాల వెంటా పరుగెడుతుంటే, ఏమి చేసినా మనకు మానసిక శాంతి దొరకడం చాలా కష్టం.

     ఈ వ్యాసం పైన మీ అభిప్రాయాన్ని కింది comment box ద్వారా తెలియ జేయండి.

     సహజంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలుసు కోవడానికి sahajarogya.com లో వ్యాసా లను రెగులర్ గా చదవండి.

     ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే social media ద్వారా share చేయండి.

Please Share It

Leave a Comment