Lunch Dinner with Natural Food

Lunch Dinner with Natural Food

సహజ ఆహారం తో మధ్యాహ్నం

రాత్రి భోజనం

      గతం లో ఒక కథ చెప్పే వారు. నంది తో శివుడు “మనుషుల ఆహార నియమాల గురించి” చెప్పి రమ్మని పంపాడంట. రోజు లో మూడు సార్లు స్నానం చేయాలి, ఒక్కసారి తినాలి. అని చెప్పి పంపాడట. అయితే ఆ నంది ఇక్కడికి వచ్చి చెప్పడం లో పొరబడి, మూడు సార్లు తినాలి, ఒక్కమారు స్నానం చేయాలి అని చెప్పాడట.

     విషయం తెలిసిన శివుడు, తప్పు చెప్పావు కాబట్టి, వారికి మూడు పూటలా అవసర మైన ఆహారాన్ని పండించు కోవడానికి నీవే సాయం చేయమని నందిని మనుషుల వద్దకు పంపించాడని కథనం. ఈ కథను నమ్మినా నమ్మక పోయినా, ఈ మూడు పూటల తిండి తో మనం చాలా ఇబ్బంది పడుతున్నది మాత్రం వాస్తవం కదా.

      యోగా నియమాలలో కూడా ఒక విషయం చెబుతారు. ఏక భుక్తం యోగి. ద్విభుక్తం భోగి. త్రి భుక్తం రోగి అని. అంటే రోజు లో ఒక్క సారి తింటే యోగి అనీ, రెండు సార్లు తింటే భోగి (అనుభవించే వాడని) అనీ, మూడు సార్లు తింటే రోగాల పాలు కాక తప్పదనీ దీని అర్థం. కానీ ఈ నియమాలను అర్థం చేసుకుని పాటించే వారు అరుదు. అయితే మనం ప్రస్తుతం కొన్ని వేల సంవత్సరాలుగా మూడు సార్లు తినడానికి అలవాటు పడ్డాం కాబట్టి, ఇప్పుడు ఆ నియమాన్ని మార్చుకోవడం కష్టం. మానసికం గా చాలా పట్టుదల ఉంటేనే ఇదేమైనా సాధ్య మౌతుందేమో అనుమానమే.

      కాబట్టి మనం మూడు పూటలా తిన్నా, మంచి ఆహారాన్ని, మనకు రోగాలు రాని ఆహారాన్ని, సహజమైన ఆహారాన్ని తినడానికి ఒక గట్టి ప్రయత్నం చేద్దాం. రోగాల బారిన పడకుండా, హాయిగా, ఆరోగ్యంగా జీవించుదాం.

      ఇంతకు మునుపు రాసిన రెండు వ్యాసాల లో  ఉదయం కాఫీ, టీ లకు బదులు గా తీసుకోవలసిన హుంజా టీ గురించి, ఆ తర్వాత తీసుకోవాల్సిన అల్పాహారం(Break-Fast) గురించి తెలుసు కున్నాం. ఇప్పుడు ఈ వ్యాసంలో మధ్యాహ్నం, రాత్రి తీసు కోవలసిన ఆహారం గురించి తెలుసు కుందాం.

     మనం మధ్యాహ్నం తినే ఆహారానికి కూాడ మన బరువే ఆధారం. ఉదాహరణకు మన బరువు 90 కేజీలు అనుకుందాం. దానిని బట్టి మనం తినవలసిన ఆహారాన్ని లెక్కలు వేద్దాం.

మధ్యాహ్నం భోజనానికి రెండు పల్లేలు(Plates) పెట్టుకోవాలి

    ఒక పల్లెం లో 90 కేజీలు X 5 = 450 గ్రాముల కూర గాయలు ఉంచుకోవాలి. తిన గలి గిన ఏ కూరగాయలైనా తీసుకోవచ్చు. క్యారెట్, టమోటా, కీరదోస, ముల్లంగి, బీట్ రూట్, బెండ మొదలైనవి. 450 గ్రాములు కనీసం. ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు. అప్పర్ లిమిట్ లేదు.

    రెండవ పల్లెం లో మీకు ఇష్టమైన వండిన ఆహారం తీసుకోవాలి.

     అయితే దీనికి మొదటి నియమం – ఈ వండిన ఆహారం లో ఉప్పు, నూనెలు అతి తక్కువగా ఉండాలి.

    మరో ముఖ్య నియమం, తప్పకూడని నియమం – మొదటి పల్లెం లో ఉన్న కూర గాయలు పూర్తిగా తినాలి. ఆ తర్వాతే వండిన ఆహారం ఉన్న పల్లెం లోని పదార్థాలు తినాలి.

      రాత్రి కూడా మధ్యాహ్నంలో లాగే 2 ప్లేట్ల విధానాన్ని పాటించాలి. అయితే రాత్రి 7 గంటలలోపు తినడం పూర్తి చేయాలి.

మనం మాన వలసినవి

  1. పాలు, గుడ్డు తో సహా జంతు, పక్షి సంబంధమైన పదార్థాలేవీ తినకూడదు.
  2. విటమిన్ టాబ్లెట్లు కానీ, టానిక్ లు కానీ తీసుకోకూడదు.
  3. రిఫైన్డ్ పుడ్ కానీ, ప్యాకింగ్ చేసిన ఆహారాలు కానీ తినకూడదు.

మనం చేయవలసినవి

  1. ప్రతి రోజూ కనీసం 45 నిమిషాల పాటు శరీరానికి ఎండ తగలాలి.
  2. ప్రతి రోజూ కనీసం ఒక గంట పాటు వ్యాయామం చేయాలి. అది నడక గానీ, యోగా కానీ, జిమ్ కానీ. ఏది మీకు అనుకూలమైతే అది తప్పకుండా చేయాలి.

మీరు తినదగిన ఇతర చిరు తిండి – రోజుకు

     మనం చాలా కాలంగా చిరు తిండ్లకు అలవాటు పడ్డాము. ఇది లేనిదే మనకు రోజు గడవదు. కానీ ప్రస్తుతం కొంత కాలం పాటు మామూలుగా మనం తినే చిరు తిండ్లు – మిరపకాయ బజ్జీలు, పునుగులు, కారాలు, కర్జికాయలు, నిప్పట్లు, అరిసెలు ఇలా లిస్టు చాలా పెద్దది. వీటిని కొంత కాలం మానాలి. ఈ కింద చెప్పినవే చిరుతిండ్లు గా తినాలి.

  1. మన బరువుకు 90 కేజీలకు సమానమైన గ్రాముల మొలకలు. 90 గ్రాములు.
  2. బరువుకు సమానమైన గ్రాముల డ్రై ఫ్రూట్స్(Nuts). 90 గ్లాములు.
  3. పండ్లు ఏవైనా తినొచ్చు.
  4. కొబ్బరిబోండాం నీళ్లు ఎన్నైనా తాగొచ్చు.

      ఈ విధానం మీరు పాటించ గలిగితే, ప్రారంభంలో రోజుకు కనీసం 200 గ్రాములనుండి 500 గ్రాముల వరకు బరువు తగ్గుతారు. దానితో పాటుగా, మీ కున్న ఇతర చాలా ఇబ్బందులు, రోగాలు క్రమ క్రమంగా తొలగి పోతాయి.

      ఈ వ్యాసం పైన మీ అభిప్రాయాన్ని కింది comment box ద్వారా తెలియ జేయండి.

      సహజంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలుసు కోవడానికి sahajarogya.com లో వ్యాసాలను రెగులర్ గా చదవండి.

      ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే social media ద్వారా share చేయండి.

Please Share It

Leave a Comment