Millets Our Ancient Treasure Telugu

Millets Our Ancient Treasure Telugu

సిరి ధాన్యాలు మన ఐశ్వర్యాలు

     సిరి ధాన్యాలు మనకు మన పెద్దల నుండి సంక్రమించిన ఐశ్వర్యాలు. మనం జీవితాంతం ఆరోగ్యంగా జీవించడానికి ఇవి సహాయ పడతాయి. ఇవి తప్ప మరో మార్గం లేదు.  ఈ సిరి ధాన్యాలను తిని ఎలా ఆరోగ్య వంతులమౌవ్వాలో మనలో ప్రతి ఒక్కరూ తెలుసు కోవాలి. దీన్ని మనం ఆచరించి, ప్రతి రోజూ ఈ సిరి ధాన్యా లను తింటే, మన ఆరోగ్య స్థితి ని బట్టి,  6 నెలల నుండి 2 సంవత్సరాల లోగా అందరం సంపూర్ణ ఆరోగ్య వంతులం కావచ్చు. మనం ప్రస్తుతం వాడుతున్న అన్ని రకాల మందులను పూర్తిగా మాన వచ్చు. క్యాన్సర్ లాంటి రోగాలు కూడా నయమయ్యే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు మనం ఏం చదివాం?

      మనం ఇప్పటి వరకూ ఆరోగ్యం కాపాడు కోవడం కోసం ఎలాంటి సహజ ఆహారాలు తినాలో చూశాం. ముఖ్యం గా పండ్లు, కూర గాయలు, హుంజా టీ వంటి వాటి గురించి తెలుసు కున్నాం. అవి ఎప్పుడు, ఎలా తినాలో కూడా గత వ్యాసాలలో చదివాం. ఉదయం ఆల్పాహారం గా ఏమి తీసుకోవాలి, మధ్యాహ్నం, రాత్రి భోజనం లోకి ఏమేమి, ఎలా తినాలో కూడా తెలుసు కున్నాం. అయితే మన లో చాల మందిమి, ఇప్పటికి కొన్ని దశాబ్దాలుగా వండిన ఆహారాన్నే తింటున్నాము. దానికి పూర్తిగా అలవాటు పడ్డాము. వండిన ఆహారం తిన కుండా మనకు పూట గడవదు. మనం ఒక పూట లేదా ఒక రోజు వండిన ఆహారం తినక పోతే ఏదో పోగుట్టు కున్నట్టుగా ఉంటుంది. చాలా మందికి ఒక్క పూటైనా వండిన అన్నం తినక పోతే చాలా ఇబ్బంది పడు తుంటారు. “కనీసం కొద్దిగా పెరుగన్నమైనా  తినందే నాకు తృప్తిగా ఉండదు” అనడం మనం చాలా సార్లు విని వుంటాం.

వండిన ఆహారంతో ఆరోగ్యం

      కాబట్టి మనం వండిన ఆహారం తిన ఆరోగ్యాన్ని కాపాడు కోలేమా? అని చాలా మంది అడుగు తున్నారు. ప్రస్తుతం మనం తింటున్న బియ్యం, గోధుమలు వండుకుని తింటే రోగాల పాలు కావడం తప్పదని గత వ్యాసాలలో వివరంగా చెప్పుకున్నాం. ఇక దీని బదులు గా మనం వండి న ఆహారం తినికూడా ఆరోగ్యాన్ని కాపాడు కోవడం సాధ్య మౌతుందని కర్ణాటక రాష్ట్రం, మైసూరుకు చెందిన ఆహార నిపుణులు, శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వల్లి గారు  తెలియ జేస్తున్నారు. ఆ విధానం ఏమిటో, ఎలా పాటించాలో తెలుసు కుందాం.

చిరు ధాన్యాలు కాదు సిరి ధాన్యాలు

      చిరుధాన్యాల(Millets) పేరుతో ఇంత కాలం మనకు తెలిసిన కొన్ని ధాన్యాలకు మరిన్ని ధాన్యాలను జత చేసి వాటికి “సిరి ధాన్యాలు”(Golden Grains) అని నామకరణం చేశారు ఖాదర్ వల్లి గారు. ఇంతకు మునుపు మనము రాగులు, జొన్నలు, సద్దలు ఇలాంటి వాటిని చిరు ధాన్యాలు అని పిలుచుకునే వారం. కొంత మందికి కొర్రల గురించి తెలుసు. చాలా కొద్ది మందికి ఆరెకల గురించి తెలిసి ఉండొచ్చు. ఊదులు మనం ముందు తరం వారికి కొంత తెలిసి ఉండవచ్చు.

ప్రస్తుతం “సిరి ధాన్యాలు” గా చెప్పు కుంటున్నవి ఈ ఐదు.

  1. కొర్రలు (Fox Tail Millets)
  2. ఆరెకలు (Kodo Millets)
  3. సామలు (Little Millets)
  4. ఊదులు (Barnyard Millets)
  5. అండు కొర్రలు. (Brown Top Millets)

2 సంవత్సరాలలో సంపూర్ణ ఆరోగ్యం

      వీటినే ఇప్పుడు మన వండుకుని ఆహారం గా తీసుకుంటే, మన ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చు. వీటిని కనీసం 6 నెలల నుండి 2 సంవత్సరాల పాటు తింటే సంపూర్ణ ఆరోగ్య వంతులు కావచ్చు. ఏదైనా తీవ్ర రోగాలు ఉన్న వారు, వీటితో పాటుగా కొన్ని కషాయాలు తయారు చేసుకుని తాగితే, ఎంతటి తీవ్రమైన జబ్బైనా దూరమై మనకు ఆరోగ్యం చేకూరుతుంది. జబ్బులున్న వారు ఈ ఆహారాన్నీ, కషాయాలను ఎలా తీసు కోవాలో మరో వ్యాసంలో వివరిస్తాను. వీటిని ఖాదర్ వల్లి గారు వేలాది మందికి చెప్పి, వారిని సంపూర్ణ ఆరోగ్య వంతులను చేశారు.  మనం కూడా ఆయన బాటలో పయనించి, ఆరోగ్యంగా జీవిద్దాం.

వీటితో అన్ని రకాలూ చేసుకోవచ్చు

      సాధారణంగా ఎవరైనా ఈ ఐదు రకాల “సిరి ధాన్యాలు” సేకరించి వీటినే మూడు పూటలా తినాలి. ప్రతి 2 రోజులకు ఒక రకం చొప్పున తినాలి. వీటితో మనం బియ్యం, గోధుమలతో చేసుకో గలిగిన అన్ని రకాలూ, దాదాపు గా చేసు కోవచ్చు. ఏవో కొన్ని మినహా యింపులు తప్ప. వీటితో అన్నం వండు కోవచ్చు. దోసెలు, ఇండ్లీలు వంటి టిఫిన్ లు చేసు కోవచ్చు. బిసిబేళా బాత్ వంటి వెరైటీ కన్నడ వంటకాలు చేసుకోవచ్చు. వీటిని వండు కోవడానికి ఒకే ఒక ముఖ్య మైన షరతు ఏమిటంటే, ఇవి వండడానికి కనీసం రెండు గంటలకు ముందు నీటిలో నాన బెట్టాలి.

పోషక పదార్థాలు ఘనం

      ఈ సిరిధాన్యాలలో ఇతర అన్ని ధాన్యాలకంటే అత్యధిక శాతం పీచు పదార్థం (Fiber) ఉంటుంది. వీటిలో 8% నుండి 12% పీచు పదార్థం ఉంటుంది. అదే తెల్ల బియ్యం లో 0.2%, ముడి గోధుమలలో 1.2% మాత్రమే పీచు పదార్థం ఉంటుంది. కానీ సిరి ధాన్యాలలో కేవలం పీచు పదార్థమే కాకుండా, మన శరీర పోషణకు అవసరమైన అన్ని రకాల విటమిన్లు, మినరల్స్, ప్రోటీనులు తదితరాలన్నీ కావలసినన్ని ఉంటాయి.

తెలుపంటే  గొప్ప

      తెల్లదంటే గొప్ప. తెల్లగుంటే గొప్ప. అని మన బుర్రలలో స్థిర పడి పోయింది. తెల్ల వాళ్లు మన దేశాన్ని పరి పాలించి నప్పటినుండి మనకు ఈ నమ్మకం ఏర్పడి పోయింది. దీన్నించి మనం ఇప్పటికీ బయట పడలేక పోతున్నాం. అందుకే నల్ల వాడితో పోలిస్తే, తెల్లగా ఉన్న వాడికి మనం మనకు తెలియ కుండానే ఎక్కువ గౌరవం ఇస్తాం. ఇదే పద్ధతిని మనం మన తిండీ, తిప్పలలో కూడా చొప్పించి ఆస్పత్రుల పాలౌతున్నాం. మనం ఇప్పుడు తింటున్న తెల్ల బియ్యం, తెల్ల గోధుమ పిండి, మైదా పిండి ఇవే మన రోగాలకు మూల కారణాలు. వీటిని మానేసి మనకు ఆరోగ్యాన్నిచ్చే సిరి ధాన్యాలను తినడం ఆరంభిస్తే, ఆరోగ్యం తనంతట తానే మన దరి చేరుతుంది.

      ఈ వ్యాసం పైన మీ అభిప్రాయాన్ని కింది comment box ద్వారా తెలియ జేయండి.

     సహజంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలుసు కోవడానికి sahajarogya.com లో వ్యాసాలను రెగులర్ గా చదవండి.

     ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే social media ద్వారా share చేయండి.

Please Share It

Leave a Comment