Natural Alternate to Coffee and Tea

Natural Alternate to Coffee and Tea

కాఫీ, టీ లకు  సహజ ప్రత్యామ్నాయం

మిత్రులారా !

      నేను కొన్ని విషయాలు పూర్తిగా చెప్పిన తర్వాత ఈ టాపిక్ కు రావలసింది. అయితే కొందరు మిత్రులు ఒక వాదం తీసుకు వచ్చారు. తిన కూడనివి చెబుతున్నావు. వాటి వెంబడే తిన వలసినవి కూడా చెబితే సౌకర్యం గా ఉంటుంది కదా అని.అందుకే దీన్ని ప్రారంభించాను.

     ప్రస్తుతం మనం తీసుకుంటున్న కొన్ని ఆహారాలు మనకు అనారోగ్యాన్ని ఇస్తు న్నాయి కదా. వాటికి బదులుగా మనం తీసుకో గలిగిన మంచి ఆహార పదార్ధాలను గురించి తెలుసుకుందాం. ఇందు లో మనం ఉదయం లేవగానే, మనకు అత్యవసరంగా అనిపించే కాఫీ, టీ లు. నాకు తెలుసు కాఫీ, టీ లు అలవాటు ఉన్న వాళ్లు దానిని మాను కోవడం చాలా కష్టం. అది వారి తప్పిదం కూడా కాదు. వాటి లో ఉన్న కెఫీన్(caffeine). ఇది ఒక మత్తు పదార్థం. ఇది మన మెదడు పై పని చేసి మనలను కాఫీ, టీ లకు బానిస ను చేస్తుంది. కానీ మన దీర్ఘకాల ఆరోగ్యాన్ని దృష్టి లో ఉంచుకుని మనం ఈ కాఫీ, టీ లను మానుకోవాలి. వాటి బదులుగా మన ఆరోగ్యాన్ని హాని చేయని వాటిని తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేద్దాం.

కాఫీ, టీలు ఎందుకు మానాలి

     కాఫీ, టీలు తీసుకోవటం హానికరం. మరీ ముఖ్యంగా ఉదయం పూట తీసుకోవడం మరీ హానికరం. ఎందుకంటే ఉదయం లేవగానీ పొట్ట ఖాళీగా ఉంటుంది. అది ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దాని లోపలి గోడలు చాలా శుభ్రంగా ఉంటాయి. దాని పైకి మనం టీ, కాఫీలను పంపడం మంచిది కాదు. ఎందుకంటే అవి ఆమ్ల గుణం(Acidic nature) కలిగి ఉంటాయి. అవి పొట్ట లోపలి పొరలను దెబ్బతీసి అనేక రోగాలకు (inflammatory and life style diseases) కారణమౌతాయి. ముఖ్యంగా ఎముకల రోగాలకు, షుగర్ వ్యాధికి ఇదే ప్రధాన కారణమని అనేక పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.

 కాఫీ, టీ లను తయారు చేసే పదార్థాలు ఎంత హాని కరమో తెలుసు కోవ డానికి ఇదే సైట్ లోని మరో వ్యాసం చదవండి

     మన శరీరం ఎప్పుడూ క్షార గుణం(Alkaline Nature) కలిగి ఉండాలి. అటు ఆమ్ల గుణం (Acidic nature), ఇటు క్షార గుణం(Alkaline Nature) కాకుండా బ్యాలన్స్ (Nuetral) గా ఉన్నా పరవాలేదు. అధిక ఆమ్ల గుణం ఉండడం శరీర ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ ఆమ్ల, క్షార గుణాల స్థితిని మనం pH విలువ ద్వారా తెలుసు కుంటాం. లాబ్ లలో దీన్ని పరీక్షిస్తారు. ఈ pH విలవల గురించిన పూర్తి సమాచారాన్ని మరో వ్యాసంలో తెలుసుకుందాం.  

      మన పొట్టలోకి ఆమ్ల గుణం కలిగించే సాధారణ కాఫీ,టీ లకు బదులుగా మనం హుంజా టీ(Hunza Tea) అనే దాన్ని తీసుకోవచ్చు. ఈ హుంజా టీ అనేది వందల సంవత్సరాలుగా ఉన్నా, దీన్ని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. దీనికి విసృత ప్రాచుర్యం కల్పించిన ఘనత మాత్రం  డాక్టర్ బిస్వరూప్ రాయ్ చౌదరి దే. హుంజా లోయ(Hunza Valley) అనే ప్రాంతం మన భారతదేశానికి వాయవ్యం (NorthWest) లో పాకిస్తాన్ – చైనా ల మధ్య ఉన్నప్రాంతం. ఇక్కడ జీవిస్తున్న వారు  ఈ హుంజా టీని తాగుతారు. వీరి సగటు వయసు 110 సంవత్సరాలు. అక్కడి మహిళలు మరింత ఎక్కువ కాలం జీవిస్తారు. ఇది ప్రపంచంలో అత్యంత ఆరోగ్యకరమైన మనుషులున్న ప్రాంతం గా గుర్తింపు పొందింది. ఈ హుంజా టీ తయారీకి వాడే పదార్థాలను, తయారీ విధానాన్ని తెలుసు కుందాం. దీని తయారీకి ఉపయోగించే పదార్థాలన్నీ మనకు సులభంగా లభ్య మయ్యేవే.

హుంజా టీ తయారీకి అవసరమైన పదార్థాలు

  1. తులసి ఆకులు – 8
  2. పుదీన ఆకులు  – 12
  3. యాలకలు పచ్చనివి – 4
  4. దాల్చిన చెక్క – 2 గ్రాములు
  5. అల్లం – 20 గ్రాములు
  6. బెల్లం – 20 గ్రాములు
  7. నీరు – 200 మిల్లీ లీటర్లు

 

హుంజా టీ తయారీ విధానం

      ఒక గిన్నెలో 200 మిల్లీ లీటర్ల నీటి ని తీసుకోవాలి. తులసి ఆకులు, పుదీన ఆకులను రాయితో కొద్దిగా నలపండి., యాలకలు, చెక్క లను కూడా రాయితో లేదా చిన్న రోటిలో దంచండి. మరీ నున్నగా చేయరాదు. అల్లం వేరుగా దంచాలి.  నీటిని స్టౌ పైన చిన్న మంటలో ( సిమ్ లో) ఉంచి వీటన్నింటినీ ఒక్కొక్కటిగా కలపండి. కనీసం 10 నిమిషాలు వేడి చేయాలి. దించడానికి 2 నిమిషాలకు ముందు బెల్లం కొద్దిగా నలగగొట్టి అందులో వేయాలి. ఇక మీ హుంజా టీ సిద్ధం. దీనిలో రుచికి నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. దీన్ని వేడిగా నైనా, చల్ల బడ్డాకైనా తీసుకోవచ్చు.

గమనిక:- తాటి బెల్లం మంచిది- చెఱకు నల్ల బెల్లం పరవాలేదు. తెల్ల బెల్లం మాత్రం వాడొద్దు.

      రాబోయే వ్యాసాలలో టీ, కాఫీలకు బదులుగా తీసుకో గలిగే మరిన్నింటి గురించి తెలుసుకుందాం. అంతకు మునుపే ఉదయం అల్పాహారం ఏమి తీసుకోవాలో చూద్దాం.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను కింది comment box ద్వారా తెలియ జేయండి.

      సహజంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలుసు కోవడానికి sahajarogya.com లో వ్యాసాలను రెగులర్ గా చదవండి.

            ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే social media ద్వారా share చేయండి.

Please Share It

Leave a Comment