Natural Healthy Break Fast

Natural Healthy Break Fast

ఇలా తింటే రోగాలు దరి చేరవు

      మానవుడు ప్రకృతి లో సహజంగా జరిగిన పరిణామాల ద్వారా తయారయ్యాడని మనందరికీ తెలుసు. కాబట్టి మనం తినదగిన ఆహారం ప్రకృతిలో సహజంగా లభించేదే.

      ప్రకృతిలో ఏ స్థితిలో ఆహారం లభిస్తుందో, అదే విధంగా దాన్ని తింటే మనకు ఎలాంటి అనారోగ్యం వచ్చే అవకాశమే లేదు. పైగా ఇలా సహజ ఆహారాన్ని తీసుకుంటే, మనకు ఇప్పటికే ఉన్న రోగాలు కూడా నయమౌతాయి. మనం ఉదయం పూట ఏ ఆహారాన్ని తీసుకోవాలో ఈ రోజు తెలుసు కుందాం.

     కాఫీ, టీ లకు బదులుగా ఏమి తీసుకోవాలో ఇంతకు మునుపు వ్యాసం లో తెలుసు కున్నాం.

     ఉదయం లేవగానీ కాఫీ తీసుకుని కాస్త స్థిమిత పడ్డాక ఇక అల్పాహారం ( Break – Fast) గురించి ఆలోచిస్తాం. దీని పేరు అల్పాహారమే గానీ, ఆ అర్థం మారి పోయి చాలా కాల మైంది. మనం ఉదయమే, ఇడ్లీ-వడ చట్నీలు, సాంబార్ లతో, దోసె-ఉప్మా కనీసం రెండు రకాల చట్నీలతో, పూరి-పొంగల్ రెండు, మూడు చట్నీలు, కూర్మాలతో తీసు కుంటుంటాం. ఇలా రక రకాల కాంబినేషన్ లలో మన ఆల్పాహారం ప్రారంభమౌతుంది. ఇవి అల్పాహారాలు కాదు. ఇవి భోజనం కంటే అధికా హారాలు. వీటిని మానేసి మనం సహజ ఆహారాల వైపు చూపు సారిద్దాం.

     సహజమే ఆరోగ్యం

      ప్రకృతి లో సహజంగా లభించేవి, ఎంతో రుచి కరమైనవి, మనకు ఆరోగ్యాన్నిచ్చేవి పండ్లే. ఇవి కూడా వండ బడిన ఆహారాలే. వీటిని ప్రకృతే, సూర్య రశ్మి సాయంతో వండుతుంది. పండ్లలో విటమిన్లు, మినరల్స్, ప్రోటీనులు, పీచు పదార్థం ఇలా మన శరీరానికి అవసరమైన అన్ని రకాలూ, కావలసినన్ని ఉంటాయి. అవి కూడా శరీరం సులభంగా జీర్ణం చేసుకుని, గ్రహించ గల స్థితి లో ఉంటాయి. మనకు ఈ పండ్లన్నీ రుతువుల(Season) ప్రకారం పండుతాయి. ఇప్పుడంటే season లతో పని లేకుండా, ఎప్పుడంటే అప్పుడు, అనేక రకాల పండ్లు లభిస్తున్నాయి. కానీ వీలైనంత వరకూ  మనం ఏ రుతువు లో లభించే పండ్ల ను ఆ రుతువులోనే తినడం ఉత్తమం. ప్రకృతి ఈ పండ్లను సీజన్ లో ఇవ్వడానికి ఉన్న ప్రత్యేక కారణాలు మనలో చాలా మందికి తెలుసు. ఉదాహరణకు పుచ్చకాయ(Water melon) ఇది ఎండా కాలం లోనే పండు తుంది. ఎందుకూ? దీని లో నీటి శాతం అధికంగా ఉండి, మనకు చల్ల దనాన్ని ఇస్తుంది కాబట్టి. ఇలా ప్రతీ పండూ ఆ సీజన్ లోనే పండటానికి ఒక బలీయ మైన కారణం ఉంటుంది.

పండ్లను మనం రోజుకు ఎన్ని, ఎలా తీసుకోవాలో చూద్దాం

      ప్రతి రోజూ ఉదయమే మనం తీసుకోవలసిన ఈ పండ్ల పరిమాణం(Quantity) మన బరువు పైన ఆధార పడి ఉంటుంది. ఉదాహరణకు మన బరువు 90 కేజీలు అను కుందాం. దీనికి సూత్రం మన బరువు కేజీలలో X10 = గ్రాములలో పండ్ల బరువు.  90X10=900 గ్రాములు. మనం 90 కేజీల బరువుంటే, 900 గ్రాముల పండ్లు తీసుకోవాలి. ఇది కనీస పరిమాణం. దీని పైన ఎంతైనా పరిమితి లేకుండా తినవచ్చు. ఆ సీజన్ లో దొరికే పండ్ల లో కనీసం 4 రకాలు తీసుకుంటే మంచిది. అన్ని రకాలు లభించ నపుడు దొరకినవే తీసు కోవచ్చు. ఇదే రకమైన పండ్లు తీసుకోవాలనే నియమం ఏమీ లేదు. ఏవైనా తినవచ్చు. మామిడి, అరటి, సీతాఫలం, సపోట, ఆపిల్, ద్రాక్ష, బత్తాయి, కమలా మొదలైనవి ఏవైనా తిన వచ్చు. వీటికి పరిమితి లేదనుకున్నాం కదా. కడుపు నిండా తినవచ్చు.

      సాధారణంగా మనం ఉడికిన ఆహారం తిన్న తర్వాత, ఏదో కొంత మొక్కు బడిగా ఒక అరటి పండో, రెండు ఆపిల్ ముక్కలో ఇలా తింటుంటాం. కాబట్టి మనకు ఎక్కువగా పండ్లు తినే అలవాటు ఉండదు. అందుకని ఈ పండ్లు మొత్తం ఒకేసారి తినడానికి ఇబ్బందిగా అనిపిస్తే, రెండు మూడు దఫాలుగా తిన వచ్చు. ఉదయం 8 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల లోపు గా తిని పూర్తి చేయవచ్చు.

      మనం ఉదయం ప్రస్తుతం తినే పూరీలు, దోశలు తిన్న తర్వాత పొట్ట బరువుగా అని పించడమో, మత్తుగా ఉండడమో జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకప్పుడు అనుభవమయ్యే ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఎన్ని పండ్లు తిన్నాగానీ పొట్ట బరువు అనిపించదు. మత్తుగా ఉండదు. పైగా శరీరం ఇంకా తేలికగా, చురుకుగా ఉంటుంది.

     అన్ని పండ్లూ ఆరోగ్య కరమే

      సాధారణంగా కొన్ని వ్యాధులు ఉన్న వారు కొన్ని రకాల పండ్లు తిన కూడదని డాక్టర్లు చెబుతుంటారు. కానీ ఈ నియమం వండిన ఆహారాలు తిని, దాని తర్వాత పండ్లు తినే వారికే వర్తిస్తుంది. కేవలం పండ్లను మాత్రమే తినే వారికి ఈ నియమం వర్తించదు. వారు ఎలాంటి పండ్ల నైనా తిన వచ్చు. డాక్టర్ బిస్వరూప్ గారు తమ ఆరోగ్య శిబిరాలలో డయా బెటిక్(షుగర్) రోగులకు ముఖ్య ఆహారంగా మామిడి పండ్లు తిని పిస్తారు. వారిని ఈ పండ్లు మరింత ఆరోగ్య వంతులను చేశాయని ఆయన నివేదికలు చెబుతున్నాయి. ఆయన ఇలాంటి పండ్ల ను వేల మంది కి తిని పించి, వారిని అనేక రోగాల నుంచి విముక్తు లను చేశారు.

      ఒక్కసారి ఈ అనుభవాన్ని చవి చూడండి. దాని పై మీ అభిప్రాయాలను నాకు కింది కామెంట్ బాక్సు ద్వారా తెలియ జేయండి.

     ఇక మధ్యాహ్నం, రాత్రి తిన వలసిన సహజ ఆహారాన్ని గురించి తర్వాత వ్యాసంలో తెలుసుకుందాం.

      సహజంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలుసు కోవడానికి sahajarogya.com లో వ్యాసాలను రెగులర్ గా చదవండి.

     ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే social media ద్వారా share చేయండి.

Please Share It

Leave a Comment