Natural Immunity Power

Natural Immunity Power

సహజ రోగ నిరోధక శక్తి

మన ఆరోగ్యమంటే మనకు చాలా నిర్లక్ష్యం

      మనం అన్ని విషయాలలో ఎక్కువగా విధిని, లేదా అదృష్టాన్ని నమ్ముతాం. ఆరోగ్య విషయంలో కూాడ అంతే. ఆరోగ్యం, దానంతట అదే బాగుంటుందను కుంటాం. ఒకవేల దారి తప్పి ఏదైనా ఇబ్బంది వస్తే, దాన్ని మందులతో అణిచేస్తాం. మనం మంచి ఆరో గ్యంగా ఉండడానికి ఎలాంటి గట్టి ప్రయత్నాలు చెయ్యం. మన జీవితాలలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినంతగా, ఇంక ఏ విషయాన్ని నిర్లక్ష్యం చెయ్యమనేది వాస్తవం.

రోగాలు రావడం తప్పని సరి కాదు

      ఇక్కడ మనం గుర్తుంచు కోవలసింది ఏమంటే, రోగాలు లేదా అనారోగ్యం తప్పని సరిగా రావలసి నవి కాదు. మన శరీరంలో అవసరమైనంత రోగ నిరోధక శక్తి ఉంటే ఏ రోగమూ మన దరి చేరడానికి సాహసించదు. మనలో ని ఈ సహజ రోగ నిరోధక శక్తిని, మనంతకు  మనం అడ్డుకుని, అంతరాయం కలిగించక పోతే, మనం జీవతాంతం ఆరో గ్యంగా జీవించ వచ్చు. మనలో ఈ రోగ నిరోధక శక్తి బలంగా ఉంటే, ఎలాంటి సూక్ష్మ జీవులు గానీ, రోగాలు గానీ మనలను ఏమీ చేయలేవు.

      ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కాలిఫోర్నియా కు చెందిన డాక్టర్ థామస్ పోవెల్. ఈయన చాలా కాలం కిందట(1970 ప్రాంతాలలో) , ఒక ఓపన్ ఛాలెంజ్ చేశాడు. “ఏవరైనా సరే తన శరీరంలోకి ఎలాంటి రోగ కారక సూక్ష్మ జీవులనైనా ప్రవేశ పెట్టి రోగం తీసుకు రావచ్చు” అని. చాలా మంది చాల రకాలుగా ప్రయత్నం చేశారు.ప్లేగు , కలరా తదితర వ్యాధి  కారక సూక్ష్మ జీవులను ఆయన శరీరం లోకి ప్రవేశ పెట్టారు. కొన్ని ఆహా రం ద్వారా, కొన్నింటిని ఇంజక్షన్ ల ద్వారా శరీరం లోకి ఎక్కించారు. కానీ ఆయన ఎ లాంటి రోగాల పాలు కాలేదు. హాయిగా, ఆరోగ్యంగా 80 సంవత్సరాల పాటు జీవించా రు. ఢిల్లీకి చెందిన డాక్టర్ బిస్వరూప్ రాయ్ చౌదరి. ఈయన 2018 సంవత్సరం ఏప్రిల్ లో జరిగిన మీటింగ్ లో స్టేజి పైనే  ఈ ఎయిడ్స్ గురించి అన్ని విషయాలు వివరించారు. రక్తం ద్వారా కానీ, లైంగిక సంబంధం ద్వారా కానీ ఎయిడ్స్ రాదు, అని సోదాహరణంగా నిరూపించారు. మెడికల్ మాఫియా ఈ ఎయిడ్స్ పేరు చెప్పి ఎలా ప్రజలను దోచు కుంటుందో చెప్పారు.

జబ్బులను నయం చేసేది డాక్టర్ కాదు

సహజ రోగ నిరోధక శక్తే

      ఎంతో శక్తి వంతమైన ఈ సహజ రోగ నిరోధక శక్తి వెనుక ఉన్న రహస్యం చాలా చిన్నది. నాగరికత పెరిగే కొద్దీ, మనం ప్రకృతి నుంచి దూరమౌతున్నాం. ప్రకృతి సహజ నియమా లను ఉల్లంఘించడం పెరిగి పోతోంది. దీనితో మన రోగ నిరోధక శక్తి తగ్గి పోతోంది. అదే మనం రోగాల పాలు కావడానికి ప్రధాన, ఏకైక కారణమని అనేక పరిశోధనల ద్వారా రుజు వౌతోంది. గతంలో వైద్యులకు కూడా దీని పై ఆవగాహన ఉండేది. ఎంతో గొప్ప డాక్టర్లు కూడా ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పేవారు. రోగాన్ని నయం చేసేది రోగులలోని రోగ నిరోధక శక్తి మాత్రమే గానీ,  డాక్టర్లు కాదు. రోగాన్ని నయం చేసే ప్రక్రియ లో డాక్టర్ ఒక సహాయ కారి మాత్రమే అని అంగీకరించే వారు.

     మనందరికీ ఈ సహజ రోగ నిరోధక శక్తి గురించి తెలుసు, చాలా మందికి దానిపైన నమ్మకం కూడా ఉంది. కానీ మనందరం రోగ లక్షణాల నుంచి వెంట వెంటనే విముక్తి చెందడం కోసం మాత్రలను, మందులను ఆశ్రయిస్తున్నాం. వాటి వైపే మొగ్గు చూపు తూ, సహజం గా తనను తాను బాగు చేసుకునే శరీర శక్తిని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ మందుల వినియోగం, మన రోగ నిరోధక శక్తిని అడ్డుకుని, దాన్ని నాశనం చేస్తోంది. మన కు వచ్చే జబ్బులలో 85 శాతం జబ్బులకు ఎలాంటి డాక్టర్ లేదా మందుల అవసరం లేదు. మనం శరీరానికి అవకాశం ఇస్తే, అదే తనకు వచ్చిన రోగాలను నయం చేసు కుంటుంది. కొన్నిరోగాలకు మన తిండిని మార్చుకోవడమే పరిష్కార మార్గం.

     ఈ సహజ రోగ నిరోధక శక్తి అనేది ఊహ కాదు, పరిశోధన ల ద్వారా నిరూపించ బడిన నిజం. ఇప్పుడు ఈ సహజ రోగ నిరోధక శక్తి తగ్గడానికి గల కారణాలు తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తి తగ్గడానికి కారణాలు

      హాని కలిగించే, తప్పుడు విధానాలలో జీవించడం. రోగ కారక ఆహారాన్ని తీసుకోవడ మే ప్రధాన కారణాలు. ఇంకా అస్తవ్యస్త జీవన విధానం, వేగవంతమై పోయిన జీవితం, చెడు అలవాట్లకు బానిస కావడం, కనీస శారీరక శ్రమ లేక పోవడం, మానసిక వత్తిడులు, కాలుష్యం, విచక్షణా రహితంగా మందులను ఉపయోగించడం తదితరాలు కూడా అనేక ఇతర కారణాలు గా చెప్పుకోవచ్చు. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.

తప్పుడు అలవాట్లు, రోగ కారక ఆహారం

      మన శరీర రోగ నిరోధక శక్తి తగ్గడానికి దీన్ని ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మనం ఆహార పదార్థాలలో విచక్షణా రహితంగా మసాలాలను(Spices) వాడుతున్నాం. ఎక్కువ గా వేపుడు కూరలు (Fried Food) తింటున్నాం. ఫ్రిజ్ లో ఉంచిన పదార్థాలు, ఐస్ క్రీమ్ లు బాగా తింటున్నాం. అపరిమితంగా  తీపి పదార్థాలు (Sweets) తింటున్నాం. ఇవన్నీ కలిసి మన జీర్ణ వ్యవస్థను దెబ్బ తీస్తున్నాయి.

      మనందరికీ తెలిసిన ఒక సామెత ఉంది. “బ్రతకడం కోసం తినాలి గానీ తినడం కోసం బతక కూడదు” అని. కానీ ప్రస్తుతం మనలో  ఎక్కువ మందిని పరిశీలిస్తే, తినడం కోసమే బతుకుతున్నట్లుగా ఉంటుంది. మనం తరచూ విందులు, వినోదాలలో మునిగి తేలుతున్నాం. మనం ఎప్పుడూ కొత్త వంటకాలూ, కొత్త రుచులూ కనిపెట్టడానికి ప్రయ త్నిస్తుంటాం. అదీ గాక తెల్లని పిండిని – బియ్యం పిండి, గోధుమల పిండి, మైదా పిండి – తదితరాల వాడకం విపరీతంగా పెరిగి పోతోంది.అలాగే  మనం తింటున్న తిండి మంచి దా, అందులో మనకు అవసరమైన పోషక పదార్థాలు ఉన్నాయా లేదా అని కనీసం గా కూడా ఆలోచించడం లేదు. అవసరాని కంటే ఎక్కువగా తింటున్నాం. ఒక సారి భోజనం చేశాక, అది పూర్తిగా జీర్ణమై, మళ్లీ ఆకలయ్యే దాకా మరోసారి ఆహారాన్ని తీసుకోకూడదు. అది విషం తో సమానం. ఇలా చేసి మన జీర్ణ వ్యవస్థను మనమే నాశనం చేసుకుంటు న్నాం. అందుకే ఇది మన రోగ నిరోధక శక్తి నాశనం కావడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

అస్తవ్యస్త జీవన విధానమే రోగాలకు మూలం

      మనం జీవితం ప్రస్తుతం పరుగు పందెం లాగా మారి పోయింది. ఉదయం లేచింది మొదలు పరుగులెత్తడమే. సరైన సమయంలో ఏ పనీ చేయలేక పోతున్నాం. ఉదయం లేవడం గానీ, ఆహారాన్ని తీసుకోవడం కానీ, నిద్ర పోవడం కానీ ఏదీ ఒక నిర్ణీత సమయా నికి చేయలేక పోతున్నాం. మన జీవితాలలో మన ప్రమేయం లేకుండా ప్రవేశించిన టెలివిజన్, మొబైల్ ఫోన్ లు మన జీవన శైలి ని పూర్తి గా మార్చేశాయి. ఈ అస్తవ్యస్త జీవన విధానం, ఆహార విధానం వలన శరీరం లోని మలినాలు బయటకు వెళ్లకుండా నిల్వ ఉండి పోతున్నాయి. ఇది మొత్తం జీర్ణ వ్యవస్థను నాశనం చేస్తోంది. ఇదే రోగ నిరోధక వ్యవస్థను నాశనం చేసి, అనేక రోగాలకు పునాది ఏర్పాటు చేస్తోంది.

వ్యసనాలకు బానిస – రోగాలకు వేదిక

      కొన్ని వ్యసనాలకు, తప్పుడు అలవాట్లకు మనం బానిసలమైతే, అది మన లోని రోగ నిరోధక వ్యవస్థను దెబ్బ తీస్తుంది. మన శరీరం రోగాలకు వేదిక అవుతుంది. మీరు వ్యస నాలు అంటే సిగరెట్, బీడీలు, మద్యం తాగుడు, మాదక ద్రవ్యాల వినియోగం మాత్రమే అనుకుంటున్నారు కదూ? వీటి తో పాటు కాఫీ, టీలు అతిగా తాగడం కూడా వ్యసనం కిందికే వస్తుంది. అంతే కాకుండా చాక్ లెట్లు అతిగా తినడం కూడా వ్యసనమే. మళ్లీ, మళ్లీ తినాలనే పించే అన్ని రకాల తిండి పదార్థాలు కూడా వ్యసనం కిందే లెక్క. మనం తినే ఫాస్ట్ ఫుడ్ లు, ఐస్ క్లీమ్ ల లో కూడా మనలను వాటికి బానిసలను చేసే టేస్ట్ సాల్ట్, కృత్రిమ తీపి పదార్థాలు కలుపుతారు. అందు వల్లనే వాటిని మళ్లీ, మళ్లీ తినాలని అనిపి స్తుంది. పిల్లలనూ, పెద్దలనూ వాటికి బానిసలను చేస్తుంది. ఇలాంటివి తినడం వలన మన శరీరం లోని విటమిన్లు నాశనమౌతాయి. ఉదాహరణకు ఒక సిగరెట్ తాగితే, అది మన శరీరం లో నిల్వ ఉన్న 25 మిల్లీ గ్రాముల “సి” విటమిన్ ను నాశనం చేస్తుంది.

వొళ్ళు వంచి శ్రమ చేయక పోతే రోగాల పాలే

      ప్రస్తుత రోబోటిక్ యుగంలో మనం శ్రమ చేయడమనే విషయాన్నే మరచి పోయాం. ప్రతి దానికీ మనం యంత్రాల మీదే ఆధార పడుతూ ఉన్నాం. అది ఇంటి పని కానీ, బయటి పని కానీ. పోనీ పనులకు యంత్రాలను వాడినా, కనీసం వాకింగ్, ఆసనాలు వంటి వన్నా చేస్తున్నామా అంటే, అదీ లేదు. ఆడవారు కానీ, మగ వారు కానీ ఇంట్లో గానీ, బయట గానీ శ్రమ చేయాలనే ఆలోచనే ఉండటం లేదు. ఎంత సేపూ పని ని తప్పించు కుందామన్న ఆలోచనే. చిన్న, చిన్నపనులకు కూడా మనం పని మనుషుల పైనే ఆధార పడుతున్నాం.

     మరో వైపు మనం మానసికంగా కూడా, శారీరక శ్రమ చేసే వారిని తక్కువగా చూస్తు న్నాం. మేధో శ్రమ చేసే వారికే ఎక్కువ గౌరవం ఇస్తున్నాం. ఈ ఆలోచనా సరళి మారాలి. శ్రమించడమే గౌరవం (dignity of labour) అనే విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ శారీరక శ్రమకు మనం దూరమవడమే, మనలో రోగ నిరోధక శక్తి తగ్గి పోవడానికి మరో కారణం.

మానసిక వత్తిడి లేని మనిషే కనిపించడం లేదు

      ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సంపాదన కోసం పరుగులు పెడుతున్నారు. ఉన్న దానితో తృప్తి పడటం లేదు. లక్షలున్నా, కోట్లున్నా ఇంకా, ఇంకా సంపాదించాలనే యావ చావ డం లేదు. దాని కోసం లేని బరువులను నెత్తి కెక్కించు కుంటున్నారు. దీంతో మెదడు పై భారం పడి, మనశ్శాంతి ని కోల్పోతున్నారు. డెల్ కార్నెగీ అనే రచయిత తన “How to Stop worrying and start Living” అనే పుస్తకంలో ఒక విషయం చెబుతాడు. అమెరికా లో ప్రపంచ యుద్ధం లో చనిపోయిన వారి కంటే, మానసిక వత్తిడి వల్ల చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువని. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మానసిక వత్తిడి ఎంత ప్రమా ద కరమో. ఇది మనషి లోని రోగ నిరోధక శక్తిని కూడా దెబ్బ తీస్తుంది.

కాలుష్యం ప్రభావం కూడా గణణీయం

      ఈ రోజుల్లో కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అభివృద్ధి చెందు తున్న దేశాలలో ఈ కాలుష్యం ప్రమాద కర స్థాయికి చేరుకుంది. మరీ ముఖ్యంగా మెట్రో సిటీలలో దీని ప్రభావం ఎంతో మందిని రోగాల పాలు చేస్తోంది. పెరుగుతున్న వాహనా లు ఒక వైపు, పరిశ్రమలు విడుదల చేస్తున్న కాలుష్యం మరో వైపు రోజు, రోజుకూ పెరిగి పోతూనే ఉంది. మన రోగ నిరోధక శక్తి పైన ఈ కాలుష్యం ప్రభావం కూడా గణణీయంగా ఉంది.

అతిగా మందుల వినియోగం నష్ట దాయకం

     అల్లోపతి మందుల వాడకం, సహజ రోగనిరోధక శక్తిని నాశనం చేస్తుందన్న విషయం,  ఎలాంటి అనుమానం లేకుండా నిరూపించ బడిన వాస్తవం. మనం ఈ రోజుల్లో చిన్న దానికీ, పెద్ద దానికీ విచక్షణా రహితంగా మందులను వాడుతున్నాం. సైడ్ ఎఫెక్ట్ లేని అల్లోపతి మందే లేదని, డాక్టర్లూ, సైంటిస్టులే అంగీకరిస్తున్నారు. ఈ మందుల దుష్ఫలి తాలను దాచి పెట్టి, డాక్టర్లూ, మందుల కంపెనీల వారు,  వాటిని మనకు అంట గడు తున్నారు. ఇవి మనపైన చూపే దుష్ఫ్రభావాలకు అంతే లేదు. మన శరీరం లోని రోగ నిరోధక శక్తికి ప్రధాన వనరు తెల్ల రక్తకణాలు. ఇవి ఎముకల మూలుగు (Bone Marrow) లో ఉత్పత్తి అవుతాయి. మందులు ఈ ఎముకల మూలుగు పైన తమ ప్రభావాన్ని చూపు తాయి. ఆ ప్రభావం తెల్ల రక్త కణాల ఉత్పత్తి పైన పడుతుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తి తగ్గితే మన రోగ నిరోధక శక్తి కూడా తగ్గినట్టే.

     ఈ వ్యాసం పైన మీ అభిప్రాయాన్ని కింది comment box ద్వారా తెలియ జేయండి.

      సహజంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలుసు కోవడానికి sahajarogya.com లో వ్యాసా లను రెగులర్ గా చదవండి.

      ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే social media ద్వారా share చేయండి.

Please Share It

1 thought on “Natural Immunity Power”

Leave a Comment