Stop Refined Cereals 2

Lunch n Dinnerప్రపంచం జనాభా ప్రధాన ఆహారం బియ్యమే

      బియ్యం – ప్రపంచంలో అత్యధిక శాతం ప్రజలు తినే ఆహారం. ముఖ్యంగా ఆసియాలో ఇదే ప్రధాన ఆహారం. దీని మంచి చెడ్డల గురించి తెలుసుకుందాం.

      ఒక సాధారణ సూత్రం గా తీసుకుంటే, బియ్యం లో కూడా పిండి పదార్థమే ఎక్కువగా ఉంటుంది. విటమిన్లు, మినరల్స్, పీచు పదార్థాలు లేకుండా ఏ ఆహారాన్ని తీసుకున్నా అది మన ఆరోగ్యానికి హానికరమే. ప్రస్తుతం మనమందరం తింటున్నతెల్ల బియ్యం లో కేవలం పిండి పదార్థం మాత్రమే ఉంటుంది. దీని తో శరీరానికి అవసరమైన పోషకాలు ఏవీ అందవు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయన్న ఏకైక కారణంగానే మనం ఈ తెల్ల బియ్యాన్ని వాడుతున్నాం. దీనికి తోడు ఇవి తెల్లగా మెరుస్తూ, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

Donot Eat Riceబెరి బెరి వ్యాధికి తెల్ల బియ్యం ఒక కారణం

      తెల్ల బియ్యంలో బి-విటమిన్లు ఉండవు. దీనితో శరీరానికి అవసరమైన థయామిన్(thiamine) అందదు. ఇది బెరిబెరి అనే వ్యాధికి దారి తీస్తుంది. ఈ బెరి బెరి వ్యాధిలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి వెట్ బెరిబెరి. దీని వల్ల గుండె సంబంధ సమస్యలు వస్తాయి. గుండె కొట్టుకునే వేగం పెరగడం (fast heart rate), ఎక్కువ సార్లు ఊపిరి తీసుకోవాల్సి రావడం(Shortness of breath), కాళ్ల వాపులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక డ్రై బెరిబెరి వల్ల మెదడు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

తెల్ల బియ్యం తింటే అధికబరువు, షుగర్ వ్యాధి  తప్పదుObesity

      తెల్ల బియ్యం తిన్న వారికి స్థూలకాయం (obesity) సమస్య సర్వ సాధారణం. ఇది తిన్న వెంటనే అరిగిపోతుంది. దాంతో రక్తంలో  సడన్ గా గ్లూకోజ్ పెరుగుతుంది. దీన్ని జీవకణం లోపలికి పంపడానికి అవసరమైన ఇన్సులిన్ ను పాంక్రియాస్ ఉత్పత్తి చేస్తుంది. గ్లూకోజ్ రక్తం లోని నుండి లోపలికి వెళ్లగానే వెంటనే రక్తంలో షుగర్ తగ్గి పోతుంది. మనకు మళ్లీ ఆకలి వేస్తుంది. దీంతో మరో తిండి ఏదో ఒకటి శరీరానికి అందించాల్సి వస్తుంది. ఇది శరీర బరువును పెంచుతుంది. మరో వైపు అధిక ఇన్సులిన్ ఉత్పత్తి వలన పాంక్రియాస్ బలహీన పడి, మెల్లగా షుగర్ వ్యాధికి దారి తీస్తుంది.

భూమి నుండి బియ్యంలోకి చేరే ఆర్సెనిక్(arsenic)Paddy Crop

      బియ్యం లోకి భూమి లోని ఆర్సెనిక్ (arsenic) అనే ప్రమాదకర మూలకం చేరుతుందని ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనలు రుజువు చేశాయి. దీనితో పాటు కాడ్మియమ్ (Cadmium), క్లోమియమ్ (Chromium), సీసం (Lead), పాదరసం (Mercury) లాంటి అనేక భార లోహాలు కూడా అనేక దేశాలలో కనిపించాయి. బియ్యంలో కూడా గోధుమల లాగే ఫైటిక్ యాసిడ్ (Phytic Acid) ఉంటుంది. ఆరోగ్యం పై దీని ప్రభావం గురించి ఇంతకు మునుపు వ్యాసం లో తెలుసుకున్నాం.  ఫైటిక్ ఆసిడ్(phytic acid) మన ఆహారం లోని కాల్షియమ్, జింక్, ఐరన్, మెగ్నీషియమ్ లాంటి మినరల్స్ ను తనతో కలుపు కుంటుంది. వీటిని మన శరీరానికి అందకుండా చేస్తుంది.

తెల్ల బియ్యం కంటే ముడి బియ్యం మేలు

      ముఖ్యం గా తెల్ల బియ్యంతో పోలిస్తే, ముడి బియ్యం మెరుగు. ముడి బియ్యం లోని పై పొరలో పీచు పదార్థం 1.3 శాతం వరకు ఉంటుంది. అదే తెల్ల బియ్యం లో పీచు పదార్థమే ఉండదు. ఇదే కాక ముడి బియ్యం లో కనీస స్థాయిలో విటమిన్లు, మినరల్స్ లాంటి పోషక పదార్థాలు కూడా ఉంటాయి. మొత్తంగా బియ్యం పెద్దగా ఉపయోగ పడక పోయినా, తెల్ల బియ్యంతో పోలిస్తే ముడి బియ్యం కొంత మెరుగు అని అనేక పరిశోధనలు తెలుపు తున్నాయి.

      86 వేల మంది పురుషులను 5.5 సంవత్సరాల పాటు, 75 వేల మంది స్త్రీలలో 10 సంవత్స రాల పాటు గమనించిన విషయాలను పరిశీలించారు. వీరిలో తెల్ల బియ్యం తిన్న వారిలోకంటే ముడి బియ్యం తిన్న వారిలో గుండె జబ్బుల ప్రమాదం  20% నుండి 30% శాతం తక్కువగా ఉందని ఆ పరిశోధన లో తెలిసింది.

      ఇలా అనేక సమస్యలతో కూడిన తెల్ల బియ్యం వెంటనే మానండి. తప్పదు అనుకుంటే అప్పుడప్పుడు ముడి బియ్యం తినండి. బియ్యం, గోధుమలకు ప్రత్యామ్నాయంగా మనం తినగలిగినవి, మన ఆరోగ్యాన్ని కాపాడే ధాన్యాలు, ఇతర ఆహారాల గురించి రాబోయే వ్యాసాలలో తెలుసుకుందాం. అంతకు ముందే మనం ప్రస్తుతం తింటున్న వాటిలో మనకు హాని చేస్తున్న మరి కొన్నింటిని గురించి తెలుసుకుందాం.

      సహజ పద్ధతులలో ఆరోగ్యం గా జీవించడానికి అవసరమైన విషయాలు తెలుసుకోవడానికి sahajarogya.com ను రెగ్యులర్ గా చదవండి.

      నేను రాస్తున్న ఈ వ్యాసాలపై మీ అభిప్రాయాలను, సూచనలను ఈ కింది comment box ద్వారా నాకు తెలపండి.

Please Share It

1 thought on “Stop Refined Cereals 2”

Leave a Comment