Water The Life of Beings

Best Healer Waterనీరే… ప్రాణాధారం

     మనకు గాలి తర్వాత ముఖ్యావసరం నీరే. కానీ మనిషి కావలసినంత నీరు తీసుకోకుండా అనేక జబ్బులను కొని తెచ్చుకుంటున్నాడు.

     మనిషి అంతర్గత అవసరాలకు కనీసం 2.5 లీటర్ల నీరు అవసరమని వైద్యశాస్త్రం  చెబుతుంది. నీరంటే కేవలం నీరే. దాన్ని కూల్ డ్రింక్ లు, మద్యం, కృత్రిమ జ్యూస్ లు, కాఫీ, టీ లాంటి వాటితో పూరించరాదు.

మినరల్ వాటర్ ప్రమాదకరం

     ఇప్పుడు మనం అందరం ఈ మల్టీ నేషనల్ కంపెనీల ప్రకటనల మాయాజాలం లో పడి పోతున్నాము. ప్లాస్టిక్ బాటిళ్లలో మినరల్ వాటర్ పేరుతో రసాయనాలు (chemicals) కలిపిన నీటిని తాగుతున్నాము. ఇందులో కెమికల్స్ ఒక ప్రమాదం. అంతే కాకుండా ఇలా నీటిని ప్రాసెస్ చేయడం వల్ల, అవసరమైన కొన్ని పదార్థాలు పోవడం, అవసరం లేనివి, హాని కలిగించేవి అందులో కలవడం జరుగుతుంది.

ప్లాస్టిక్ నీరు మరీ ప్రమాదం

      మరో వైపు ప్లాస్టిక్ నీరు మరింత ప్రమాదకరం. ఎందుకంటే నీటికి ఒక లక్షణం ఉంది. దాన్ని ఏ పాత్రలో పెడితే, దాని లోని పదార్థాన్ని కొంత తనలోకి తీసుకుంటుంది. నీటిలో కలిసి ప్లాస్టిక్ కణాలు మన శరీరంలో ప్రవేశిస్తాయి. అవి ఇతర హాని చేయడంతో పాటు, చిన్న ప్రేగుల లో నుండి ఆహారాన్ని మన శరీరంలోకి పంపే రంధ్రాలను మూసేస్తాయి. దీనికి తోడు ఆ నీటిని మనం సద్ది పెట్టె (refrigerator or fridge) లో పెట్టి, మరీ తాగుతున్నాం.

 

శరీరాన్ని మజ్జుగా తయారు చేస్తున్నాం !

     ఆ మినరల్ వాటర్ రుచికి, ఈ ఫ్రిజ్ చల్లదనానికి మనం అలవాటు పడి పోయాం. బానిసల మయ్యాం అంటే బాగుంటుంది. మనకు ఎప్పుడైనా ఈ ప్లాస్టిక్ బాటిళ్లలోని మినరల్ వాటర్ అందుబాటులో లేక, సాధారణంగా లభ్యమయ్యే నీటిని తాగగానే, శరీరం ఇబ్బంది పడుతోంది. వెంటనే మనకు ఏదో ఒక రకమైన జబ్బులు వస్తున్నాయి. కనీసం జలుబు రావడం సర్వసాధారణమై పోయింది. జీవులు ఎలాంటి నీటిని తాగినా, వాటిని మనం కొని తాగే ప్లాస్టిక్ మినరల్ వాటర్ కంటే బాగా శుభ్రం చేయగల శక్తి మన శరీరానికి ఉంది. కానీ మనం దాన్ని నిర్వీర్యం చేస్తున్నాం. సుఖానికి అలవాటు పడ్డాక, కష్టం చేయలేము. అలాగే ఈ ప్లాస్టిక్ మినరల్ వాటర్ కు అలవాటు పడ్డ శరీరం, తన సహజమైన – నీటి శుభ్రపరిచే – శక్తిని కోల్పోతోంది. ఫలితంగానే మనం సాధారణ నీళ్లు తాగగానే ఇబ్బందులు, జబ్బులు రావడం.

తగినంత నీరు తాగక పోతే… ఆస్పత్రి పాలే

     ఇక దీనికి తోడు కావలసినంత నీరు తాగకపోవడం. అది కూడా దాహమేసినా తీసుకోక పోవడం. వీటి వల్లే మనకు సమస్యలు వస్తున్నాయి. మరో విషయం. నీరు ఎప్పుడూ ఆహారంతో పాటుగా తీసుకోకూడదు. తినడానికి కనీసం అరగంట ముందు వరకు తీసుకోవచ్చు. తిన్న తర్వాతైతే – మనం తినే ఆహారాన్ని బట్టి (మాంసాహారమా, శాఖాహారమా) – తినే పరిమాణాన్ని బట్టి – గంట నుండి రెండు గంటల తర్వాత నీరు తాగొచ్చు.

     మనకు ముఖ్యంగా ఉదయం లేవగానే పరగడుపున ( ఖాళీ కడుపుతో) ఎక్కువ నీరు తాగే అవకాశం ఉంది. దాన్ని ఉపయోగించుకుందాం. పొట్టలోకి, ఇతర వండిన పదార్థాలు పంపక ముందు, తాగ గలిగి నన్ని నీరు తాగడం చాలా మంచిది. మిగిలిన నీటిని రెండు భోజనాల మధ్య ఖాళీ సమయంలో తాగాలి. అప్పుడే ఆరోగ్యం. ఈ నీరు తాగే విధానం మరో సారి తెలుసుకుందాం. మరి మీరు అవసరమైనంత నీరు తాగి, ఆరోగ్యాన్ని కాపాడు కోవడానికి సిద్ధమేనా ?

     ఈ వ్యాసం పై మీ అభిప్రాయాన్ని కింది comment box ద్వారా తెలియ జేయండి

Please Share It

2 thoughts on “Water The Life of Beings”

Leave a Comment