What Happened to Bill Clinton

What Happened to Bill Clinton

బిల్ క్లింటన్ కు ఏం జరిగిందో తెలుసా?

     అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ గారి అరోగ్య విషయంలో ఏం జరిగిందో చాలా మందికి తెలియదని నా అభిప్రాయం. ఒక వేళ తెలిసినా చాలా కొద్ది మందికి తెలిసి ఉండొ చ్చు. అది కూడా ఆయనకి బై పాస్ సర్జరీ జరిగిందని తెలిసి ఉండొచ్చు. కాని ఆయన ఆ తర్వాత ఎలా కోలుకున్నారు. అందుకు ఏమి చేశారో తెలిసి ఉండక పోవచ్చు. ఇప్పుడు మనం ఆ విషయాలను వివరంగా తెలుసుకుందాం.

బై పాస్ సర్జరీ

     2001 సంవత్సరం వరకు ఆయన అమెరికా అధ్యక్షుని గా 2 సార్లు పని చేశారు. అనంతరం 2004 సెప్టెంబర్, 2 న ఆయనకు గుండె నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు యాంజియో గ్రామ్ చేసి గుండెలో నాలుగు రక్తనాళాలు మూసుకు పోయాయని చెప్పారు. వాటికి స్టంట్ వేయడం కుదరదని చెప్పి, బై పాస్ సర్జరీ చేశారు.  దాన్ని Quadruple bypass surgery or four vessel coronary bypass అంటారు. దీంతో తను ఇంక హాయిగా ఉండొచ్చునను కున్నారు.

     కానీ 2005 మార్చిలో ఆయన ఊపిరి తిత్తులలో సమస్య వచ్చింది. ఊపిరి తిత్తుల లో కొంత భాగం దెబ్బ తిన్నదని, దానికి సర్జరీ చెయ్యాలని చెప్పారు. దానికి కూడా ఆప రేషన్ చేశారు.

మళ్లీ గుండె కు స్టంట్లు వేశారు

     ఇదై పోయింది కదా అనుకుని, రిలాక్స్ అయ్యే లోగా 2010 ఫిబ్రవరి, 11 న  తిరిగి గుండె నొప్పి రావడంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్చారు. మళ్లీ యాంజియో గ్రామ్ చేసి గుండెలో మరో 2 రక్త నాళాలకు సమస్య వచ్చిందని చెప్పారు. వాటికి స్టంట్ లను అమర్చారు.

మరణ శయ్య పైన బిల్ క్లింటన్

     ఆయన అమెరికా మాజీ అధ్యక్షుడు, పైగా మంచి ధనవంతుడు కాబట్టి అతనికి ప్రపంచంలోనే అత్యంత మెరుగైన వైద్యం చేసి ఉంటారనడం లో సందేహం లేదు. అమెరికా లోనే పేరు గాంచిన వైద్యుల ఆధ్వర్యంలో ఆ చికిత్సలు జరిగి ఉంటాయి. అయితే దుర దృష్టం ఏమిటంటే, ఇన్ని చికిత్సలు జరిగినా, ఆయన ఆరోగ్యం మెరుగవ లేదు. 2011 నాటికి ఆయన మరణ శయ్య పైన ఉన్నారు. వైద్యులు ఇక మేము చేయగలిగింది ఏమీ లేదని పూర్తిగా చేతులెత్తేశారు.

పునరుజ్జీవనం

      అన్ని మార్గాలు మూసుకు పోయిన ఆ స్థితిలో ఆయనకు ఒక కొత్త విషయం తెలి సింది.  “China Study Diet” or “Whole Food Plant Based diet” అనే కాన్సెప్ట్ ఒకటి ఉందని, దాన్ని అనుసరించిన వారు చాలా రోగాలను నయం చేసుకుంటున్నారని తెలిసింది. దాని పైన ఎన్నో పరిశోధనలు జరిగాయని, కొన్ని లక్షల మంది మీద దాన్ని ప్రయోగించి ఫలితాలను నిర్దారించారని తెలుసు కున్నారు. తాను కూడా దాన్ని ఆచ రించి చూస్తే బాగుంటుంది కదా అని ఆలోచించారు. తాను ఇప్పటికే  “death bed” పై ఉన్నాను కాబట్టి, ఏ ప్రయోగం చేసినా పోయేదేమీ లేదను కున్నారు. ధైర్యంగా ఆ కొత్త ఆహార విధానాన్ని అను సరించారు. కేవలం 6 నెలలు, అది ఖచ్చితంగా 100% కూడా పాటించలేదు. కానీ ఆయన ఊహించని విధంగా ఫలితాలు కనిపించాయి. ఆ తర్వాత చేసిన వైద్య పరీక్షా ఫలితాలను చూసి డాక్టర్లే ఆశ్చర్య పోయారు. ఆయన గుండె రక్త నాళాలు పూర్తిగా శుభ్రమై పోయాయి. రక్త నాళాల లోని కాల్షియం డిపాజిట్లు కొట్టుకు పోయాయి. పెరిగిన అదనపు బరువు తగ్గి నార్మల్ బరువుకు వచ్చారు. అమెరికా అధ్య క్షునిగా ఉన్నప్పుడు ఎంత శక్తి వంతంగా, ఆకర్షణీయంగా ఉన్నారో అలా తయార య్యారు. ఈ విషయాన్ని అయనే స్వయంగా CNN న్యూస్ ఛానల్ ఇంటర్వూలో చెప్పారు.

     ఇప్పుడు మనం ఈ “China Study Diet” or “Whole Food Plant Based diet” అంటే ఏమిటో తెలుసుకుందాం.

చైనా స్టడీ డైట్

     T.Colin Campbell, Thomas M Campbell అనే తండ్రీ కొడుకులైన డాక్టర్ లు 2005 లో అమెరికాలో “The China Study” పేరుతో  ఒక పుస్తకాన్ని ప్రచురించారు. ఇది మిలి యన్ (10 లక్షలు) పైగా కాపీలు అమ్ముడు పోయి రికార్డు సృష్టించింది. ఇది చైనాలో కొన్ని వేల మంది మీద 20 సంవత్సరాల పాటు జరిగిన ఆహార పరిశోధన గురించిన పుస్తకం. మనషులు పాలతో సహా జంతు సంబంధమైన పదార్థాలు తిన్న వారి కంటే వృక్ష సంబంధమైన ఆహారం తిన్న వారే ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నారని, జబ్బులకు దూరంగా ఉన్నారని తెలియ జేసే పుస్తకం.

     ఇది ఎంతో సంచలనం సృష్టించింది. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది దీన్ని అనుకరించడం ప్రారంభించారు. జంతు సంబంధ మైన ఆహారమే రోగాలకు ప్రధాన కారణమని ఈ పుస్తకం చెబుతుంది. వృక్ష సంబంధమైన ఆహారం అంటే ఆకు కూరలు, కూర గాయలు, పండ్లు మనలను ఆరోగ్యంగా  ఉంచడమే కాక, రోగాలు వచ్చిన వారికి కూడా వాటి నుండి విముక్తి కలిగిస్తున్నాయని అందరికీ తెలిసి పోయింది. 2011 తర్వాత అమెరికా మాజీ అధ్యక్షడు కూడా ఈ ఆహార విధానాన్ని పాటించే మరణ శయ్య పై నుండి బయట పడ్డారు. తన విధులను గతంలో లాగా యధా విధిగా నిర్వ హించు కోవడం మొదలు పెట్టారు. ఆయన ఆ విషయాన్ని ధృవీకరిస్తూ CNN న్యూస్ ఛానల్ ఇంటర్వూ లో చెప్పడంతో ఈ విషయం మరో సారి వెలుగు లోకి వచ్చి, మరింత ప్రాచుర్యం పొందింది.

     కాబట్టి మనందరం కూడా, పాలతో సహా జంతు సంబంధమైన ఆహారాన్ని- చికెన్, మటన్ లాంటివి – మానుకుందాం. వృక్ష సంబంధ ఆహారాలు – పండ్లు, కూర గాయలు, ఆకు కూరలు- తిని ఆరోగ్యంగా జీవించుదాం.

     ఈ వ్యాసం పైన మీ అభిప్రాయాన్ని కింది comment box ద్వారా తెలియ జేయండి.

     సహజంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలుసు కోవడానికి sahajarogya.com లో వ్యాసా లను రెగులర్ గా చదవండి.

     ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే social media ద్వారా share చేయండి.

Please Share It

Leave a Comment