Wheat Grass Juice Cures Cancer

Wheat Grass Juice Cures Cancer

క్యాన్సర్ కూడా తగ్గించే

గోధమ గడ్డి జ్యూస్ తయారీ

       గోధుమ గడ్డి రసం చాలా రోగాలను నయం చేస్తుంది. సాధారణ రోగాలు మొదలు కొని, క్యాన్సర్ వరకూ నయం చేయడం దీని ప్రత్యేకత. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో ? ఎంత పరిమాణం లో తీసుకోవాలో? క్యాన్సర్ వంటి రోగాలు ఎలా నయం చేసుకోవాలో తెలుసుకుందాం.

        ఇంతకు మునుపు వ్యాసంలో చెప్పుకున్నట్లు 7 రోజుల తర్వాత గడ్డిని కోయాలి. కోసిన గడ్డిని శుభ్రంగా కడగాలి. తర్వాత వీలైతే చిన్న ముక్కలుగా చేసి, మిక్సీలో వేసి కొద్దిగా నీటిని పోసి గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం దాన్ని వడగట్టుకుని తాగాలి. మిక్సీ వాడటం ఇష్టం లేని వారు రోటిలో కొద్దిగా దంచి, తర్వాత రుబ్బుకోవచ్చు.  అందులో రుచి కోసం ఎట్టి పరిస్థితు ల్లోనూ ఉప్పూ, కారం, మిరయాల పొడి లేదా ఛాట్ మసాలా వంటివి కలపరాదు. ఆ జ్యాస్ ను గాజు గ్లాసులో పోసుకుని కొద్ది, కొద్దిగా సిప్ చేస్తూ తాగాలి

      సాధారణ ఆరోగ్యవంతులు, ఎలాంటి జబ్బులు లేనివారూ, చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నవారూ రోజుకు 50 మిల్లీలీటర్ల వరకు  గోధుమగడ్డి రసం తీసుకోవచ్చు. ప్రారంభం లో మనకు దీన్ని తాగడం కొంత వికారం కలిగించ వచ్చు. వాంతులు కూడా రావచ్చు. అరుదుగా జలుబు, జ్వరం, విరేచనాలు కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి భయ పడాల్సిన అవసరమే లేదు. రెండు, మూడు రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి. అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు జ్యూస్ ను పలుచగా చేసుకుని తాగండి. మూడో రోజు తర్వాత కూాడ ఇలాంటి ఇబ్బందులుంటే రెండు రోజుల పాటు ఆపి, తిరిగి ఈ రసం తాగటం మొదలు పెట్టండి. ఇక ఏ ఇబ్బందులూ రావు. తీవ్రమైన జబ్బులు అంటే జబ్బులు కొంత అడ్వాన్స్ డ్ స్టేజీలో ఉన్నవారు 25 మిల్లీ లీటర్లతో ప్రారంభించాలి. దీన్ని క్రమంగా పెంచుకుంటూ పోవాలి. మనజబ్బు తీవ్రతను బట్టీ, తాగినప్పుడున్న ఇబ్బందులను బట్టీ 200 మిల్లీలీటర్ల వరకూ పెంచుకుంటూ పోవాలి. నిదానంగా మన ఆరోగ్యం మెరుగు పడుతుంది. మనకు ఆ విషయం కొద్ది కొద్దిగా అర్థం అవుతూ ఉంటుంది. కనీసం ఆరు మాసాల తర్వాత మన ఉన్న అన్ని ఇబ్బందులూ తొలగి పోతాయి. క్యాన్సర్ లాంటి తీవ్ర రోగాల విషయంలో ఏడాది నుండి రెండు సంవత్సరాల లోపు మనం పూర్తి ఆరోగ్యవంతుల మౌతాం. ఆరోగ్యం కుదుట పడ్డాక, జీవితాంతం ఆరోగ్యంగా ఉండటానికి, తిరిగి రోజుకు 50 మిల్లీలీటర్ల జ్యూస్ ను కొనసాగించాలి.

జ్యూస్ ఎప్పుడు తాగాలి

       ఎప్పుడైనా ఈ గోధుమ గడ్డి రసాన్ని ఖాళీ కడుపుతోనే తాగాలి. ఇందులో ఉత్తమం ఉదయం పూట తాగడం. ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఈ జ్యూస్ తాగాలి. తాగిన తర్వాత అరగంట నుండి ముప్పావు గంట వరకూ ఎలాంటి ఆహారం (ద్రవాహారం గానీ – కాఫీ, టీ వంటివి గానీ, ఘనాహారం గానీ)  తీసుకోకూడదు. అప్పటికి మనం తాగిన రసం పొట్టలో నుండి పూర్తిగా రక్తంలోకి ఇంకి పోతుంది. ఆ తర్వాతే మనం ఇతర ఆహారం ఏదైనా తినవచ్చు లేదా తాగొచ్చు.

గోధుమ గడ్డి ఫలితాలు – తగ్గిన క్యాన్సర్

      వెంకట్రావుకు 51 సంవత్సరాల వయసులో గొంతు పైన చిన్న గడ్డ వచ్చింది. అది క్రమంగా పెరుగుతూ వచ్చింది. కొంత నొప్పి కూడా మొదలవడంతో ఆయన తన ఫ్యామిలీ డాక్టరును సంప్రదించాడు. శ్వాసకోశం లో ఏదో ఇన్ ఫెక్షన్ వల్ల అలా జరుగుతోందని చెప్పి డాక్టర్ యాంటిబయాటిక్ మాత్రలు ఇచ్చాడు. అయినా కొన్ని రోజుల వరకూ ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఆయన మరో స్పెషలిస్ట్ డాక్టరును సంప్రదించగా, ఎందుకైనా మంచిది బ్లడ్ టెస్ట్, బయాప్సీ చేయించమని సలహా ఇచ్చాడు. అపుడు క్యాన్సర్ అని రిపోర్టు వచ్చింది.

     ఇక డాక్టర్ల ట్రీట్ మెంట్లు మొదలు. మొదట కీమోథెరపీ తో ప్రారంభించారు. కానీ ఎలాంటి ఫలితం లేక పోగా, కణితి ఇంకా పెరగసాగింది. ఆ తర్వాత రేడియో థెరపీ చేశారు. చికిత్స ప్రారంభించిన వారం రోజులకే వెంకట్రావు జుట్టు ఊడి పోవడం మొదలైంది. మొహం క్రమంగా నలుపు రంగుకు మారసాగింది. మరో వైపు క్యాన్సర్ కణితి క్రమంగా పెరగ సాగింది. మాట్లాడటం, తిండి తినడం కష్టంగా మారింది. ఈ విషయం డాక్టర్ల దృష్టికి తీసుకెళ్లడంతో వారు, ఇక లాభం లేదు. ఆపరేషన్ చేయాల్సిందే నన్నారు. ఆపరేషన్ చేసి ఆ కణితిని, దానితో పాటు కింది దవడలో కొంత భాగాన్ని తొలగించారు. ఇక భయమేమీ లేదు. క్యాన్సర్ ను పూర్తిగాతొలగించాము. నువ్వు సురక్షితంగా జీవించవచ్చు అని చెప్పారు. గొట్టాల ద్వారా ద్రవఆహారాన్ని పంపడానికి ఏర్పాట్లు చేశారు. తరచుగా ఆపరేషన్ గాయాన్ని శుభ్రం చేసుకోవాలని చెప్పి ఇంటికి పంపారు.

      ఎన్ని రోజులు గడిచినా ఆ గాయం మానలేదు. పైగా చీము పట్టడం ప్రారంభమైంది. ఆయన మళ్లీ డాక్టర్లను సంప్రదించాడు. వాళ్లు మళ్లీ అన్ని రకాల పరీక్షలు చేసి, క్యాన్సర్ శరీరం నుండి పోలేదు. అది ఊపిరి తిత్తులకు పాకింది. ఇక మేము చేయగలిగిందికూడా ఏమీ లేదు అంటూ చేతులు దులుపుకున్నారు. వెంకట్రావు కూడా ఇక చేయగలిగింది ఏమీ లేక చావు కోసం ఎదురు చూస్తూ, జీవితాన్ని భారంగా గడుపసాగాడు. అలాగే 10 సంవత్సరాలు గడిచి పోయాయి. అతనికి ఆ కాలంలో ఎన్నో సార్లు ఆత్మహత్య చేసు కోవాలనే ఆలోచన వచ్చింది. కానీ ఆయన భార్య సేవలతోనూ, ఆమె గురించి ఆలోచించి ఆత్మహత్య ఆలోచనను విరమించుకున్నాడు.

      ఆ సమయంలోనే ఒక మిత్రుని ద్వారా ఈ గోధుమ గడ్డి రసం గురించి తెలిసింది. అది సర్వరోగ నివారిణి అని ఆ మిత్రుడు చెప్పాడు. సరే తాను ఎలాగూ చావుకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి పెద్దగా శ్రద్ధ చూపలేదు. కానీ ఆయన భార్య పట్టు బట్టి ఒక ఆయుర్వేద వైద్యున్ని సంప్రదించింది. ఆయన పేషంటును పూర్తిగా పరీక్షించాడు. క్యాన్సర్ చాలా కాలంగా శరీరంలో ఉంది. శరీరం పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. గాయం నుండి చెడు వాసన కూడా వస్తోంది. కాబట్టి చికిత్స చేసినా పెద్దగాఉపయోగం ఉండదేమో, కోలుకోవడం చాలా కష్టం అని చెప్పాడు. అయితే పేషంటు భార్య పట్టు విడువ కుండా మొరపెట్టుకోవడంతో, సరే నా ప్రయత్నం నేనూ చేద్దాం అని చెప్పి చికిత్స ప్రారంభించాడు.

      గోధుమ గడ్డి రసం ఇవ్వడం ప్రారంభించిన మొదటి రోజే వెంకట్రావుకు వాంతులు కావడం తో పాటు జ్వరం ప్రారంభమైంది. దీనితో కొంత కంగారు పడ్డా చికిత్స ఆప కుండా జ్యూస్ ను కొంత పలుచగా చేసి ఇచ్చాడు. మూడు రోజులకు అన్నీ సర్దు కున్నాయి. వారమయ్యే సరికి రోగిలో కొంత మెరుగు కనిపించింది. రోజుకు 4 సార్లు జ్యూస్ ఇవ్వడంతో పాటు, ఆ రసాన్ని మెత్తని గుడ్డుకు పట్టించి గాయం పైన ఉంచారు. 10 రోజుల్లో గాయం నుండి వచ్చే వాసన ఆగి పోయింది. చీము కూడా తగ్గుముఖం పట్టింది. ఈ చికిత్స రెండు మూడు నెలలు గడిచే టప్పటికి డాక్టరుతో సహా ఎవ్వరూ ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. గాయం మాని పోయింది. మాట్లాడటం, ఆహారం తీసుకోవడం ప్రారంభమైంది. మొహం మెరుగ్గా తయారైంది. కొంత బరువు కూడా పెరిగాడు. పేషంట్ బాగా కోలుకోవడంతో అతన్ని ఆస్పత్రినుండి డిస్చార్జ్ చేశారు. ఇంటి వద్దే గోధుమ గడ్డి రసం కొనసాగించమని చెప్పాడు.

      ఆరు నెలల తర్వాత ఆస్పత్రికి వెళ్లి అన్ని రకాల పరీక్షలు చేయించారు. శరీరంలో ఎక్కడా క్యాన్సర్ లక్షణాలు లేవని రిపోర్టులు చెప్పాయి. దాన్ని వైద్యులు కూడా ధృవీకరించారు. ఇది నేను చదివి పుస్తకం లోనిది. ఉదాహరణకు దీన్ని చెప్పాను. ఈ కేసులో పేషంట్ పేరు మార్చాను. ఈ పేషంట్ 70 సంవత్సరాల వయసుతో ఇంకా జీవించి ఉన్నాడట. ఇలాంటి కేసులు మనదేశంలోనూ, విదేశాల్లోనూ ఎన్నో ఉన్నాయి. కేన్సర్ తో పాటు అనేక రకాల దీర్ఘకాలిక రోగాల విషయంలో ఈ గోధుమ గడ్డి రసం ఎన్నో అద్భుత ఫలితాలు ఇస్తోందనడంలో ఎలాంటి సందేహం అక్కర లేదు.

      ఈ వ్యాసం పైన మీ అభిప్రాయాన్ని కింది comment box ద్వారా తెలియ జేయండి.

     సహజంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలుసు కోవడానికి sahajarogya.com లో వ్యాసా లను రెగులర్ గా చదవండి.

     ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే social media ద్వారా share చేయండి.

Please Share It

Leave a Comment