Wheat Grass Juice the PANACEA

Wheat Grass Juice the PANACEA

అమృతానికి ప్రతి రూపం గోధుమ గడ్డి రసం

     గతం లో మనం చాలా కథలలో అమృతం గురించి చదివి ఉంటాం లేదా విని ఉంటాం. కాని దాన్ని మనం చూసి ఉండం. అది దేవతల వద్ద ఉంటుందని చెబుతుంటారు. దాన్ని నమ్మినా, నమ్మక పోయినా, ఇప్పుడు మనకు సులభంగా దొరికే అమృతం గురించి తెలుసు కుందాం. అదే గోధుమ గడ్డి రసం (Wheat Grass Juice). ఇది సర్వ రోగ నివారిణి. దాన్ని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

క్లోరోఫిల్ – ప్రకృతి వండిన పదార్థం

      క్లోరోఫిల్ అన్నది ఆకు పచ్చని ఆకుల్లో ఉండే పదార్థం. ఇది ప్రకృతి లోని లభించే పదార్థాలతో వృక్ష జాతి తయారు చేసుకుంటుంది. గాలి లో ఉండే హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్ తదితర మూలకాలను తీసుకుంటుంది. భూమి నుండి నీటిని గ్రహిస్తుంది. సూర్యరశ్మి ని తీసుకుని ఈ పదార్థాన్ని తయారు చేస్తుంది. దీని రసాయనికి నిర్మాణం అధిక శాతం మన రక్తాన్ని పోలి ఉంటుంది.  మనిషి రక్తం లాగే క్లోరోఫిల్ కూడా క్షార గుణమే కలిగి ఉంటుంది. రెండింటి pH విలున 7.4.

క్లోరోఫిల్ దివ్యఒౌషధం

      ఈ క్లోరోఫిల్ కు రోగ క్రిములను నాశనం చేసే శక్తి ఉంటుంది. కాబట్టి ఇది  వృక్షాలలో ప్రవేశించే రోగ కారక క్రిములను నాశనం చేస్తుంది. ఇంకా కొన్ని శక్తి వంత మైన రోగ కారక క్రిములను శక్తి హీనం చేసి స్తంభింప జేస్తుంది. ఇంకా క్లోరోఫిల్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇది గుండె పని తీరును మెరుగు పరుస్తుంది. ఆలాగా రక్త నాళాలను శుభ్రం చేస్తుంది. జీర్ణ కోశానికి, ఊపిరి తిత్తులకు, కిడ్నీలకు బలం చేకూరుస్తుంది.

      దీనిలో ముఖ్యంగా గుర్తించ వలసిన అంశం ఏమిటంటే,  క్లోరోఫిల్ చాలా సురక్షిత మైనది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిది.   

గోధుమ గడ్డి ప్రత్యేకత ఏమిటి?       

      ఈ క్లోరోఫిల్ ఆన్ని ఆకు పచ్చని వృక్ష జాతుల్లో  ఉంటుంది. అయితే మనం కేవలం గోధుమ గడ్డి రసాన్నే ఎందుకు తీసు కోవాలి? ఇతర ఆకు పచ్చని మొక్కలను, ఆకులను ఎందుకు వాడ కూడదు? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదలు తుంటుంది.

      అమెరికా కు చెందిన ప్రముఖ ఆహార నిపుణుడు డాక్టర్ ఉర్ప్ థామస్ (Dr. Urp Thomas) తన జీవిత కాలంలోని అత్యంత విలువైన 50 సంవత్సరాలూ, ఈ పరిశోధన పైనే గడిపారు. ఆ పరి శోధనలో ఆయన అన్ని రకాల ఆకు పచ్చని మొక్కలపైన పరిశోధన చేశారు. అనంతరం ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. తన పరిశోధనా ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. అన్ని రకాల ఆకుపచ్చని మొక్కల కంటే గోధుమ గడ్డి అత్యుత్తమ మైనదని గుర్తించారు. దీనిలో మానవునికి ఉపయోగ పడే అంశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.

రక్తాన్ని పోలిన గోధుమ గడ్డి రసం

      మన రక్తం నిర్మాణం, ఈ గోధుమ గడ్డి రసం నిర్మాణం చాలా దగ్గరగా ఉంటాయి. మనిషి రక్తంలో హిమోగ్లోబిన్ ఉంటుంది. ఆ హిమోగ్లోబిన్ లో హెమిన్ (Hemin) అనే పదార్థం ఉంటుంది. దీని రసాయనిక నిర్మాణం గోధుమ గడ్డి రసం లోని క్లోరోఫిల్ ను పోలి ఉంటుంది.  ఒకే ఒక్క తేడా హెమిన్ కేంద్రంలో ఐరన్ ఉంటుంది. క్లోరోఫిల్ కేంద్రంలో మెగ్నీషియమ్ ఉంటుంది.

 

మందుల కంటే త్వరగా మంచి ఫలితాలు

      అమెరికా లోని పలు ఆస్పత్రులలో చాలా కాలంగా దీన్ని రోగుల పై వాడుతున్నారు. ఆ పరిశోధనల గురించి అనేక మెడికల్ జర్నల్స్ లో ప్రచురించారు.  మొదట దీన్ని రక్త హీనత ఉన్న రోగుల పైన వాడి నప్పుడు మంచి ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత దీన్ని చర్మ వ్యాధులు, బ్రెయిన్ హెమరేజ్, టి.బి., గుండె జబ్బులు, అల్సర్, వెరికోస్ వెయిన్స్, తదితర వ్యాధులున్న పేషంట్ల పైన వాడారు. ప్రతీ జబ్బులోనూ, మందుల కంటే గోధుమ గడ్డి రసం మంచి ఫలితాలను, త్వరగా ఇస్తుందని గుర్తించారు. ఆ విషయాలపై అనే అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్ లో వ్యాసాలు రాశారు. దీనితో మొత్తం ప్రపంచానికి గోధుమ గడ్డి రసం గొప్ప దనం తెలిసింది. ఈ రసం వాడినప్పుడు మందుల కంటే చాలా తక్కువ కాలం లోనే రోగులకు స్వస్థత చేకూరడం కూడా వైద్యులు గమనించారు.

23  కేజీల ఉత్తమ కూర గాయలు = 1 కేజీ గోధుమ గడ్డి

      ఒక కేజీ గోధుమ గడ్డి ద్వారా మనుకు లభించే పోషకాలు కావాలంటే మనం 23 కేజీల ఎంపిక చేసిన ఉత్తమ కూర గాయలు తినాల్సి ఉంటుంది. గోధుమ గడ్డిలో క్లోరోఫిల్ తో పాటు మన శరీర పోషణకు అవసరమైన అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయి. గోధుమ గడ్డి క్లోరోఫిల్ లో ఉండే మెగ్నీషియమ్ (Magnesium) మన శరీరం లోని 30 రకాల ఎంజైములను ఉత్తేజ పరుస్తుంది. ఇందులో మనకవసరమైన అన్ని రకాల విటమిన్లు ఉంటాయి. విటమిన్ D, B12 మాత్రం ఉండవు. విటమిన్ C కూడా అత్యధికంగా ఉంటుంది. 100 గ్రాముల గోధుమ గడ్డిలో 18,000 అంతర్జాతీయ యూనిట్ల విటమిన్ A ఉంటుంది. గుండె ఆరోగ్యానికి, రక్త నాళాలను శుభ్రం చేయడానికి, లైంగిక శక్తి పెరగడానికి ఉపయోగ పడే విటమిన్ E గోధుమ గడ్డి లో పుష్కలంగా ఉంటుంది. ఎంతో బాగా క్యాన్సర్ ను నిరోధించ గలిగే ఏకైక విటమిన్ B17 (Laetrile) కూడా గోధుమ గడ్డి లో లభిస్తుంది. 100 గ్రాముల గోధుమ గడ్డి నుండి మనకు 90 నుండి 100 మిల్లీ గ్రాముల క్లోరోఫిల్ లభిస్తుంది.

 

గోధుమ గడ్డి ని పెంచడం చాలా సులభం

      గోధుమ గడ్డి లాంటి లక్షణాలు కలిగినవి మరికొన్ని ఉన్నాయి. అవి ఆల్ఫాఆల్ఫా గడ్డి, బార్లీ గడ్డి, పాలాకు, మెంతాకు తదితరాలు. కానీ వీటన్నింటితో పోలిస్తే గోధుమ గడ్డి ఎంతో సురక్షితమైనది, రుచికరమైనది, ఎన్నో ఉపయోగ పడే గుణాలు కలిగినది, ఎలాంటి హాని కారకాలు లేనిది గా గుర్తించ బడినది. ఇలాంటి గోధుమ గడ్డి ని పెంచడం ఎలాగో తర్వాతి వ్యాసంలో తెలుసుకుందాం.

 

ఈ వ్యాసం పైన మీ అభిప్రాయాన్ని కింది comment box ద్వారా తెలియ జేయండి.

     సహజంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలుసు కోవడానికి sahajarogya.com లో వ్యాసా లను రెగులర్ గా చదవండి.

     ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే social media ద్వారా share చేయండి.

Please Share It

Leave a Comment