Why Do We Get A Disease

Diseaseమనకు రోగం ఎందుకు వస్తుంది?

      సాధారణ మనిషి శరీరంలో 30 నుండి 50 ట్రిలియన్ జీవకణాలు (cells) ఉంటాయని శాస్త్రవేత్తల అంచనా. (1 ట్రిలియన్ అంటే ఒకటి తర్వాత 12 సున్నాలుంటాయి. 1,000,000,000,000).

     ప్రతి జీవకణంలో జరిగే చర్యలు, ఒక కెమికల్ ఫ్యాక్టరీ ని పోలి ఉంటాయి. కంటికి కనిపించనంత చిన్నదైన ఈ జీవకణ నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. దీనిలో శరీర నిర్వహణకు అవసరమైన చర్యలన్నీ జరుగుతాయి. ఈ జీవకణంలో జరిగే చర్యలకు అనువుగా, దానికి అవసరమైన మంచి ఆహారాన్ని మనం అందించ గలిగితే ఆరోగ్యం. అందుకు భిన్నంగా చేస్తే రోగం. ఈ చిన్న లాజిక్ ను అర్థం చేసుకోగలిగితే, మనం హాయిగా జీవించవచ్చు. ఆహారం, ఆలోచన ఇవి రెండూ సరిగా ఉంటేనే జీవకణం బాగుంటుంది. తన విధులను తాను సరిగా నిర్వర్తింస్తుంది. శరీరాన్ని ధృఢంగా ఉంచుతుంది.

      ప్రకృతి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉండటానికే తయారు చేసింది. రోగాలతో బాధ పడటానికి కాదు. మనం ఆ ప్రకృతి నియమాలను పాటించక పోతేనే రోగ గ్రస్తుల మౌతాం. మనం రోగాల పాలవడానికి రెండు ప్రధాన కారణాలను చెప్పొచ్చు.

  • మనం తింటున్న తిండి – ఆహారం
  • మన ఆలోచనా విధానం – ఆలోచన

CoffeeSlowPoisonస్లో పాయిజన్ తో శుభోదయం

      మొదట ఆహారం గురించి ఆలోచించుదాం. ప్రతి రోజూ ఉదయమే బెడ్ కాఫీ గానీ, టీ గానీ తాగనిదే మన దిన చర్య ప్రారంభమే కాదు.

     బెడ్ కాఫీ = slow poison

“స్లో పాయిజన్” అనే ఈ బెడ్ కాఫీ గురించి కొంచెం వివరంగా ఆలోచిద్దాం. ఇందులో కలిపే పదార్థాలు

  1. పాలు – Milk
  2. చక్కెర – Sugar
  3. కాఫీ పొడి/టీ ఆకులు – Coffee Powder/Tea Leaves
  4. నీరు – Water

చక్కెర – ఇది తెల్లటి విషం

     చక్కెర :- మొండిది, చొచ్చుకు పోయేది, అన్ని విషయాలలో తల దూర్చేది. ఇలాంటి అనేక లక్షణాలు కలది. ఈ చక్కెర కనీసం 150 రకాల వ్యాధులకు ప్రధాన కారణ మౌతుందంటే అతిశయోక్తి కాదు. దీని తయారీలో కనీసం 23 రకాల రసాయనిక పదార్థాలు (Chemicals) వాడతారు.

     దీన్ని అరిగించడానిక కాల్షియమ్(Calcium), సోడియం(Sodium), పొటాషియం (Potassium), మెగ్నీషియం (Magnesium) లు భారీగా అవసరమౌతాయి. ఈ చక్కెర ను అరిగించడానికి మన శరీరం తన ఇతర అంతర్భాగాలలో నిల్వ ఉన్నఈ మూలకాలను తీసుకుంటుంది. ఇలా తరచూ జరగడం వల్ల మన శరీరంలో ఈ మూలకాల నిల్వలు తగ్గిపోతాయి. దీని వలన అనేక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యం గా ఎముకల పటుత్వం తగ్గిపోతుంది. శరీరంలోని హానికారకాలను, మిగిలిన వ్యర్థాలను(Wastes) బయటకు పంపే శక్తి తగ్గి పోతుంది.

ఇది తీయని విషం కూడా

     చక్కెరను “తీయటి విషం (Sweet Poison)” అని మరో పేరుతో కూడా పిలవచ్చు. దీని వల్ల వచ్చే రోగాలు నేను పైన చెప్పినట్లు 150 కే పరిమితం కాదు. ఏ రోగాన్ని తీసుకున్నా, అందులో ఎంతో కొంత చక్కెర పాత్ర తప్పని సరిగా ఉంటుంది. చక్కెర ద్వారా సంక్రమించే వ్యాధుల లిస్టును రాస్తూ పోతే, అందుకు పేజీలు చాలవు, పుస్తకాలు కావల్సిందే.

     ఒక్క టీ, కాఫీ లే కాదు. చక్కెరను ముఖ్య పదార్థంగా కలిపే ఆహారాలన్నీ రోగాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. వాటిలో కొన్ని చాక్లెట్లు, మిఠాయిలు, కాండీలు, కూల్ డ్రింక్స్ మొదలైనవి. బాధా కరమైన విషయమేమంటే, ఇవన్నీ చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైనవి. ఇష్ట మైనవి అనే కంటే వాటికి వారు బానిసలై పోతారు(addiction). ఇవే వీరిని రోగాల పాలు చేస్తున్నాయి.

రిఫైన్డ్ చక్కెర అవసరం లేదు

     “శరీర పెరుగుదలకు, అభివృద్ధికి చక్కెర అవసరం కదా?” అని కొందరు మేధావులు ఒక వాదనను లేవ దీస్తారు. నిజమే మిత్రులారా, శరీర పెరుగుదలకు, అభివృద్ధికి చక్కెర అవసరం అన్న దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే అది ఏ చక్కెర అన్నదే ప్రశ్న. అది ప్రకృతిలో సహజంగా లభించే పండ్లు, తేనె లాంటి పదార్థాలలో ఉండే చక్కెర. అది శరీర అభివృద్ధికి తోడ్పడుతుంది. అంతేకాని ఇలా రసాయనాలతో రిఫైన్డ్ చేయబడిన చక్కెర అందరకీ హాని కారకమే.

పాలు

     స్తన్య జీవులకు (బిడ్డలను కని పాలిచ్చేవి) పుట్టిన బిడ్డలకు ఆ జీవుల పాలు ఎంతో అవసరం. తన తల్లి పాలు తప్ప, మరే ఇతర జీవుల పాలను జీవితంలో ఒక్క సారైనా తాగే జీవి ఏదీ ప్రకృతిలో లేదు. ఒక్క మానవుడు తప్ప. ఇతర జీవులన్నీ తన తల్లి పాలు పుట్టినప్పుడు కొంత కాలం మాత్రమే తాగి, ఆపేస్తాయి. మళ్ళీ జీవితంలో పాలను ముట్టవు. కానీ మనుషులు మాత్రమే, ఇతర జీవుల పాలు తాగుతారు. అది కూడా చిన్నప్పుడు మాత్రమే కాదు, జీవితాంతం తాగుతారు.

     పాలు, స్తన్య జీవుల బిడ్డల పెరుగుదలకు అవసరమన్నది కాదనలేని సత్యం. ఎందుకంటే, పుట్టిన బిడ్డ పాలను తప్ప మరే ఇతర ఆహారాలను స్వీకరించలేదు. అలాగే శరీరంలో రోగ నిరోధక అభివృద్ధి చెందాలంటే తల్లి పాలు తప్పని సరి అవసరం. కాని ఇది కొన్ని రోజులు, మహా అంటే కొన్ని నెలలు మాత్రమే. ఒకసారి ఇతర ద్రవాహారాలు, ఘనాహారాలు తినటం ప్రారంభమయ్యాక, క్రమంగా ప్రకృతిలోని జీవులన్నీ పాలను మానేస్తాయి. మళ్లీ జీవితంలో తన తల్లి పాలను కానీ, ఇతర జీవుల పాలను కానీ ముట్టవు. ఒక్క మనిషి మాత్రమే తల్లి పాలను మానినా, జీవితాంతం ఇతర జీవుల పాలు తాగుతూనే ఉంటాడు.

జీవితాంతం పాలు తాగొద్దు

     స్తన్య జీవుల శరీరంలో పాలను అరిగించడాని అవసరమైన ఎంజైముల ఉత్పత్తి, చిన్న వయసులోనే ఆగి పోతుంది. ఆ తర్వాత పాలు తాగినా అవి సక్రమంగా జీర్ణం కావు. జీర్ణం కాక పోవడం వల్ల, పాలల్లోని కొన్ని పదార్థాలు శరీరంలోని అంతర్భాగాలకు అంటుకు పోతాయి. ముఖ్యంగా పొట్ట పేగుల్లో ఈ పాల పదార్థాలు అంటుకు పోతాయి. దాంతో మనం తినే ఆహారంలోని పోషకాలు మన శరీరానికి అందవు.

     ఇక ఆవు లేదా గేదె పాలు వాటి బిడ్డలకు ఆరోగ్యాన్నిస్తాయి తప్ప, మనుషులకు కాదు. పైగా హానికరంకూడా. ఎలాగంటే ఆవు, గేదెల బిడ్డలు ఆరు మాసాల నుండి ఏడాది లోగా కనీసం 4 ఆడుగుల పొడవు పెరుగుతాయి. కాని మన పిల్లలు ఏడాదిలో ఆరు అంగుళాలకు మించి పెరగరు. జంతువులంత త్వరితమైన పెరుగుదల మనుషుల్లో జరగదు. పైగా మనలో అలా జరగడం అసాధారణం, ఇంకా హానికరం కూడా.

     ఈ విషయాలను గమనంలోకి తీసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ పాలను తాగరాదు, అని నిర్ణయించు కుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో సులువౌతుంది.

“శక్తి నిల్వలను దొంగిలించే కెఫీన్”

     కాఫీ, టీ లలో ఉండే ప్రధాన పదార్థం కెఫిన్ – Caffeine. కాఫీలో కనీసం 40%, టీలో కనీసం 11% కెఫీన్ ఉంటుంది.  సాధారణంగా మనం కాఫీ గానీ, టీ గానీ తాగగానే తక్షణమే శక్తి లభించనట్లు ఫీలవుతాం. ఇంకా అలర్ట్ గా ఉన్నామనుకుంటాం. కానీ ఈ లక్షణాలను మనలో కలిగించడం కోసం ఈ కెఫీన్ శరీరం లో దాచి ఉంచిన శక్తి వనరులను దొంగిలిస్తుంది. శరీరం ఈ శక్తి నిల్వలను అత్యవసర పరిస్థితుల కోసం దాచుకుని ఉంటుంది. కానీ ఈ కెఫీన్ వాటిని అనవసరంగా తీసుకుంటూ ఉంటుంది. అలా తీసుకుని మనల ను తాత్కాలికంగా ఉత్సాహ పరచినా, కొంత సమయానికే మనం తిరిగి నీరస పడపోతాం. మరో వైపు దీర్ఘకాలంలో ఇది మన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. శరీరానికి అత్యవసర పరిస్థితులలో అవసరమైన శక్తి నిల్వలు లేక అనేక ఇబ్బందుల పాలై, మనలను రోగ గ్రస్తులను చేసే అవకాశం ఉంది.  దీని ప్రభావంతో మనకు భవిష్యత్తులో డయాబెటిస్ (చక్కెర వ్యాధి) రావడానికి రంగం సిద్ధమౌతుంది. ఇంకా కిడ్నీలు (మూత్ర పిండాలు), లివర్ (కాలేయము) పాడవటానికి ఇది ఒక ప్రధాన కారణమని అనేక పరిశోధనలు తెలియ జేస్తున్నాయి.

     ఉదయం లేచిన వెంటనే కాఫీ తాగరాదని మీరు నిర్ణయించుకుని ఉంటే ధన్యవాదాలు. ఇక ఇతర ఆహారాల గురించి తర్వాతి వ్యాసం లో తెలుసుకుందాం. ఏమేమి తినకూడదో తెలుసుకున్నాక, మనం ఆరోగ్యంగా ఉండటానికి ఏ ఆహార పదార్థాలు తినాలో కూడా తెలుసు కుందాం.

     మన జీవన విధానం గురించి పూర్తిగా తెలుసు కోవడానికి sahajarogya.com లోని వ్యాసాలను రెగ్యులర్ గా చదవండి.

     ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, సూచనలను కింది Comment Box ద్వారా తెలియజేయండి

Please Share It

1 thought on “Why Do We Get A Disease”

Leave a Comment